ప్రస్తుతం ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. ఆడపిల్ల నిర్భయంగా బయటకు వెళ్తే చాలు ఇంటికి వచ్చేదాక కూడా నమ్మకం లేదు. ఇంటికి రావడానికి కొంచెం లేటయినా తల్లిదండ్రలు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే ఇక్కడ జరిగిన ఘటన సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆడపిల్లలకే రక్షణ లేకుండా పోతుందనుకుంటే.. మగవాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా హైదరాబాద్ లో ఓ 13 ఏళ్ల బాలుడిపై 23 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలుడని కూడా చూడకుండా చిన్న పిల్లాడిపై ఆ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివారలు ఇలా తెలిపారు. హైదరాబాద్ లోని పార్శీగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ అనే 23 ఏళ్ల యువకుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో పనిచేస్తున్నాడు.అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి.. ఆ బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ బాలుడు భయపడి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆ బాలుడి తల్లిదండ్రలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…