మనం నిత్యం ఎన్నో రకాల వంటకాలు రుచి చూస్తూ ఉంటాం.అందులో కొన్ని ఆరోగ్యానికి హాని కలిగించేవి కొన్ని అయితే మరి కొన్ని వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. అందులో మజ్జిగ, లేదా బట్టర్ మిల్క్, లస్సీ ఇలా వివిధ రకాలుగా పేర్లు పిలుస్తూ ఉంటారు. పెరుగును చిలికితే మజ్జిగ వస్తుంది. ఇలా చిలికిన మజ్జిగ సుగంధ ద్రవ్యాల మిశ్రమం అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచి చేకూర్చడంతో పాటుగా మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
అంతే కాకుండా బరువు తగ్గడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది.
మజ్జిగలో కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. దీన్ని రోజూ మీరు తినే ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయి. మజ్జిగలో కాల్షియంతో పాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి.
కొవ్వులు తక్కువగా ఉన్న మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ అని పిలువబడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అయితే, ఫెమినా ఇన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మజ్జిగ ఎలా తయారు చేసినా దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. ఆహారంతో పాటు మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.ఇది ఎసిడిటీని అదుపు చేసి ఎముకలను బలపరుస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మజ్జిగ ప్రోబయోటిక్ అంటే అందులో ఆరోగ్యకరమైన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా సహాయపడుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…