Jabardasth Varsha: ఆ ముగ్గురి వల్ల ఎంతో బాధపడ్డాను… దయచేసి ఎవరు అలా చేయకండి.. వర్ష ఎమోషనల్ పోస్ట్!

Jabardasth Varsha: మోడల్ గా కెరీర్ ప్రారంభించి అనంతరం బుల్లితెర సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి జబర్దస్త్ వర్ష సీరియల్స్ లో నటిస్తూ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న వర్ష ప్రస్తుతం ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ఆ ముగ్గురి వల్ల ఎంతో బాధపడ్డాను… దయచేసి ఎవరు అలా చేయకండి.. వర్ష ఎమోషనల్ పోస్ట్!

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే వర్ష సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే వర్ష తాజాగా ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఎమోషన్ అయ్యారు.

ఆ ముగ్గురి వల్ల ఎంతో బాధపడ్డాను… దయచేసి ఎవరు అలా చేయకండి.. వర్ష ఎమోషనల్ పోస్ట్!

ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తమ్ముని గురించి తెలియజేస్తూ ఎమోషనల్ కామెంట్ చేశారు.చాలా మంది రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది ఎంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తారని వారు డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతో మంది బాధ పడాల్సి వస్తుందని తెలిపారు.

మా మాదిరి ఎవరు బాధపడకూడదు…

నా తమ్ముడు రోడ్ యాక్సిడెంట్ అయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ముగ్గురు నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా నా తమ్ముడికి ఈ పరిస్థితి వచ్చింది.దయచేసి రోడ్డు పై ప్రయాణం చేసే వాళ్ళు జాగ్రత్తగా ప్రయాణం చేయండి. మీ వల్ల మీ కుటుంబ సభ్యులు ఇతర కుటుంబ సభ్యులు బాధపడేలా చేయకండి.నా సోదరుడిని ఈ పరిస్థితుల్లో చూసి చాలా బాధపడ్డాను ఇకపై ఎవరూ అలా బాధపడకూడదు ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగవుతుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు