K.S Ramarao - Chiranjeevi: మెగాస్టార్ నటించిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే..నిర్మాత కె.ఎస్.రామారావు షాకింగ్ కామెంట్స్!
K.S Ramarao – Chiranjeevi: క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత కేఎస్ రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అభిలాష, ఛాలెంజ్ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించి నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కె.ఎస్.రామారావు తన బ్యానర్ లో ఒక చిత్రం గురించి అది మెగాస్టార్ నటించిన చిత్రం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
అప్పటివరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని విధంగా తన జడ్జిమెంట్ ఉండేది. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన
స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ అనే సినిమా విషయంలో తన జడ్జిమెంట్ పూర్తిగా విఫలమైందని అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందని ఓ సందర్భంలో ఈ సినిమా గురించి నిర్మాత రామారావు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నా బ్యానర్ లో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలబడటం తనను ఎంతగానో కలిచి వేసిందని అప్పటివరకు ఫ్లాప్ అంటే తెలియని నాకు ఈ సినిమా ఎంతో కుంగదీసిందని తెలిపారు.
అయితే ఈ సినిమా ఫలితాన్ని పొందిన తర్వాత ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అని ఆలోచించాను. అప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో విజయాలు అందుకుని ఈ సినిమాతో గుడ్డిగా ముందుకు వెళ్ళి పోవడం, వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కథ కావడం వంటి కారణాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని అయితే ఈ సినిమా తర్వాత తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో కసిగా చంటి సినిమా ను నిర్మించానని తెలిపారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…