Nagachaitanya: సమంతతోనే నాకు ఆ కెమిస్ట్రీ కుదిరింది..! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతు..!

Nagachaitanya: సమంతతోనే నాకు ఆ కెమిస్ట్రీ కుదిరింది..! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతు..!

Nagachaitanya: టాలీవుడ్ లో నాగచైతన్య సమంత విడాకులు అంశం చర్చకు దారి తీసింది. అయితే ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అనేది అస్పష్టం. దీనికి సంబంధించి అనేకమంది నెటిజన్లు తమకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటున్నారు.

Nagachaitanya: సమంతతోనే నాకు ఆ కెమిస్ట్రీ కుదిరింది..! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతు..!
Nagachaitanya: సమంతతోనే నాకు ఆ కెమిస్ట్రీ కుదిరింది..! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతు..!

ఇదిలా ఉంటే విడాకుల అనంతరం ఇటు సమంత.. అటు నాగ చైతన్య సినిమాలతో బిజీ అయ్యారు. ఇప్పటికే సమంత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ తో పిచ్చెక్కింది. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ లో నటిస్తోంది. మరోవైపు ‘యశోద’ తో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Nagachaitanya: సమంతతోనే నాకు ఆ కెమిస్ట్రీ కుదిరింది..! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతు..!

మరోవైపు ఇక నాగ చైతన్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ తో భారీ హిట్ కొట్టాడు. తాజాగా సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’ ఈ సినిమాతో నిలిచాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

విడుదలైన అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియా తో అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు నాగచైతన్య. తండ్రి నాగార్జున చేసే ఆన్ ది స్పాట్ వర్క్ చేయలేనిది ఏమైనా ఉందా..? అని అడిగితే అది బిగ్ బాస్ అని చెప్పారు.  బిగ్ బాస్ రియాల్టీ షోను నాగార్జున డీల్ చేసే విధానం చూసి ఆశ్చర్యపోయా అన్నారు.


తను హ్యాపీ.. నేను హ్యాపీ..

ఇదిలా ఉంటే తన మాజీ భార్య సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే.. సమంత నేను విడాకుల గురించి కలిసి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు తను హ్యాపీ.. నేను హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు నాగ చైతన్య. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు నాగ చైతన్య. మీరు నటించిన సినిమాల్లో ఏ హీరోయిన్ తో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కుదిరిందని అడగగా తడుముకోకుండా సమంత పేరు చెప్పాడు నాగ చైతన్య. ప్రస్తుతం చైతు చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలాగే తన తొలి బాలీవుడ్ చిత్రం ‘లాల్ సింగ్ చెద్దా’ గురించి కూడా పలు విషయాలు పంచుకున్నారు. అమీర్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనతో నటించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. అమీర్ ఖాన్ తో పనిచేసిన క్షణాలను మర్చిపోలేనని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఆయనకు ప్రతి విభాగం పైన మంచి పట్టుంది. ఇదే విధంగా ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయన్నాడు నాగచైతన్య.