Sachin Joshi: సచిన్ జోషికి షాక్ ఇచ్చిన ఈడీ..! కోట్ల ఆస్తులు జప్తు..!
Sachin Joshi: సచిన్ జోషి టాలీవుడ్ లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గతంలో అనేక సినిమాల్లో హీరో కనిపించారు. దీంతోపాటు బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా ఉన్నారు.
గతంలో విజయమాల్య సంబంధించిన విల్లా కూడా కొనుగోలు చేసి వార్తల్లో కూడా నిలిచారు. సచిన్ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించారు. మ్యూజికల్ గా ఆ సినిమా ఎంతో పెద్ద హిట్ అయింది.
ఇదిలా ఉండగా.. ఒరేయ్ పండు, నిన్ను చూడక నేనుండలేను. జాక్ పాట్ నీ జతగా నేనుండాలి సినిమాల్లో నటించారు. చివరగా 2017 లో వీడెవడు సినిమాలు కనిపించారు. గతంలో అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ లు నిర్వహించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లోనూ కనిపించారు. ఆ సమయంలో టాలీవుడ్ తరపున క్రికెట్ ఆడారు.
అయితే తాజాగా సచిన్ జోషి ఓ వివాదంలో ఇరుక్కున్నారు. సచిన్ జోషి సంబంధించి ఆస్తులను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. లోన్ ఫ్రాడ్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కొన్ని కోట్ల రూపాయలను జప్తు చేయడం చర్చకు దారి తీసింది. శనివారం ఈడీ రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ. 330 కోట్లు విలువైన ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిలో రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషి కి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవి. ఎస్ ఆర్ ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కిందటేడాది సచిన్ జోషి అరెస్టయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…