ఇలా చేస్తే బిగ్​బాస్​ టైటిల్ కొట్టడం సింపులే..ఐదు సీజన్లు గమనిస్తే అదే అర్థం అవుతుంది..!

బిగ్ బాస్ ఇప్పటి వరకు మొత్తం 5 సీజన్లు పూర్తయ్యాయి. ఇంటిని, కుటుంబాన్ని వదిలి 100 రోజులు ఉండటం అంటే మామూలు విషయం కాదు. చాలామంది ఒక్క నెల రోజులు కూడా తన తల్లిదండ్రులను, తమ ఫ్యామిలీని వదిలి ఉండలేరు.. కానీ ఇన్ని రోజులు ఒక హౌస్ లో ఎలాంటి టీవీలు, మొబైల్స్ లేకుండా ఉండటం అంటే నిజంగా గ్రేటే.

అయితే మొదటి సీజన్లో మాత్రం దాదాపు 70 రోజలు మాత్రమే పెట్టారు. కానీ తర్వాత సీజన్ నుంచి దాదాపు 100 రోజలు కంటే ఎక్కువగానే ఉండే విధంగా చూశారు. ఇలా ఆ హౌజ్ లో ఉన్న వాళ్లతో బాండింగ్ పెంచుకొని.. వాళ్లతోనే కలిసి ఉండాలి. ఒకరిని ఒకరు తెలుసుకొని జర్నీ మొదలు పెడతారు. అందులో ఎన్నో ఎమోషన్స్, కష్టాలు, బాధలతో కూడుకొని.. ఎంతో బరువైన హృదయంతో బయటకు వెళ్తుంటారు. ఇలా ఎలిమినేషన్ అయిన సమయంలో వాళ్లు ఎమోషన్ పీక్ స్టేజ్ కు వెళ్తుంది.

ఇదంతా ఇలా ఉంటే.. బిగ్ బాస్ టైటిల్ గెలుచున్న వారి వ్యవహార శైలిని గమనిస్తే.. బిగ్ బాస్ వీళ్లకే ఎందుకు టైటిల్ ఇస్తున్నాడు అనే అనుమానం కలుగుతుంది. బహుషా.. దీని వెనుకాల కారణం కూడా ఉంది. బిగ్బాస్ ఎక్కువగా ఇలాంటి వారికే ఇస్తుండటం.. ప్రజలు కూడా వాళ్లనే సపోర్టు చేస్తుండటం గమనించవచ్చు.

మొదటి సీజన్ విషయానికి వస్తే.. టైటిల్ విన్నర్ అయిన శివబాలాజీ హౌస్ లో ఎంతో ఎమోషనల్ గా ఉండేవాడు. తర్వాత తనకు తాను తెలుసుకొని అందులో ఉన్న వాళ్లతో మంచిగా మెలిగేవారు. ఇలా టెంపర్ చూపించి.. చివరకు కూల్ పర్సన్ గా పేరు తెచ్చుకొని టైటిల్ ను ఎగురేసుకుపోయాడు.

ఇక రెండో సీజన్ కు వస్తే కౌశల్ కూడా అంతే.. ఎంతో ఎమోషనల్ చూపిస్తూ.. బిగ్ బాస్ పై కూడా ఒకానొక సమయంలో ఆవేశంతో మాట్లాడాడు. చివరకు ఇతడికి టైటిల్ వచ్చేసింది. మూడో సీజన్లో కూడా అంతే రాహుల్ సిప్లిగంజ్ కు ఉన్న టెంపర్ కు ఎప్పుడో ఇంటి నుంచి బయటకు రావాలి. కానీ అతడినే టైటిల్ వరించింది. నాలుగో సీజన్లో మాత్రం టెంపర్ చూపించకున్నా.. ఎంతో కూల్ గా కనిపించిన అభిజిత్ కు టైటిల్ వరించింది. ఒకానొక సమయంలో సోహేల్ గెలుచుకుంటారని అనుకున్నారు. తాజాగా టైటిల్ గెలిచిన సన్నీ కూడా అంతే . ఎంతో ఎమోషనల్ గా ఉంటూ.. తనను తాను మార్చకుంటూ.. ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.

వీటిని అన్నింటిని గమనిస్తే.. సాటి ప్రేక్షకుడికి ఎక్కువగా వచ్చే ఆలోచన ఏంటంటే.. హౌస్ లో టైటిల్ కొట్టాలంటే.. ఎంతో ఎమోషనల్ గా ఉంటూ.. కూల్ అవుతూ.. టెంపర్ చూపిస్తూ.. దానిని కంట్రోల్ చేసుకుంటూ.. నాగార్జునతో ప్రశంసలు పొందుతూ ఉంటే.. టైటిల్ విన్నర్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయానికి వస్తున్నారు.