బిగ్ బాస్ కార్యక్రమం 15 వారాలను పూర్తి చేసుకొని ఎంతో ఘనంగా ముగిసింది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో కొనసాగి బిగ్ బాస్ ట్రోఫీను సన్నీ అందుకున్నారు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్న వారిలో మొదట సిరి బయటకు రాగా, ఆ తర్వాత మానస్ శ్రీ రామచంద్ర బయటికి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఒక అమ్మాయి ఉండడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలోనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటికి వచ్చిన సిరి బిగ్ బాస్ జర్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా బిగ్ బాస్ ట్రోఫీ షణ్ముఖ్ గెలుచుకోనందుకు బాధగా ఉందా అనే ప్రశ్న ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన సిరి మొదటి నుంచి తనే గెలుస్తాడని భావించానని అయితే షణ్ముఖ్ గెలిచలేకపోయినప్పటికీ కాస్త బాధగా ఉందని వెల్లడించారు.
ఇక బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న సన్నీ గురించి మాట్లాడుతూ.. తను గెలవడం చాలా సంతోషంగా ఉంది. బయట సన్నీ, తాను మంచి ఫ్రెండ్స్ అని, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత టాస్క్ లలో మా ఇద్దరికీ గొడవలు జరిగాయని ఈ సందర్భంగా సిరి, సన్నీ గురించి మాట్లాడారు. కానీ సన్నీ గెలవడం మనస్ఫూర్తిగా తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో తనకు షణ్ముఖ్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని తను హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నన్ను చాలా మోటివేట్ చేశారని కానీ బయటకు వేరే విధంగా ప్రోజెక్ట్ అయ్యిందని బయటకు వచ్చే వరకు తనకు తెలియదని సిరి తెలిపారు. ఇక శ్రీహాన్ తో తన వివాహం గురించి కూడా సిరి ఈ సందర్భంగా మాట్లాడారు. శ్రీహన్ ఎప్పుడంటే తన పెళ్లి అప్పుడేనని సిరి ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…