రూ.లక్షకు రూ.2 లక్షల లాభం రావాలంటే.. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టండి..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ శాఖలో ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో సామాన్యుడి ఉపయోగపడేవి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన అయితే ప్రతీ ఒక్కరు ఇష్టపడే పథకం. ఇందులో అత్యధిక వడ్డీ శాతం ఉంది. ఆడపిల్లల భవిష్యత్తుకు ఇది ఎంతగానో మేలు చేసేది .

ఇవి కాకుండా.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. తక్కువ రిస్క్ లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే పథకాలు దీనిలో ఉన్నాయి. అవి ఏంటంటే.. కిసాన్ వికాస్ పత్ర, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్‌ పథకం. వీటి ద్వారా కూడా ఎక్కువ వడ్డీని పొందొచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.. కిసాన్ వికాస్ పత్ర లో 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. దీనిలో చేరాలంటే కేవలం రూ.100 ఉంటే సరిపోతుంది. దీనిలో సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్లు అనేవి ఉంటాయి.

18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా మైనర్లు కూడా దీనిలో చేరొచ్చు.. కాకపోతే తల్లిదండ్రలు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకోవాలంటే.. రెండున్నర ఏళ్లు ఆగాలి. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనిలో పెట్టుబడి పెడితే.. 10.5 సంవత్సరాల తర్వాత రెట్టింపు తీసుకోవచ్చు. ఇక రెండోది..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్.

6.8 శాతం వడ్డీ ఉంటుంది. ఖాతాను తెరవడానికి మీరు కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవ్వాలంటే.. 10.7 సంవత్సరాలు పడుతుంది. మరో పథకం.. నెలవారీ ఆదాయ పథకం. దీనిని కూడా రూ.1000తో ఖాతా తెరవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 5 ​సంవత్సరాలు. వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లిస్తారు. డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 11 నెలల సమయం పడుతుంది.