కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ శాఖలో ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో సామాన్యుడి ఉపయోగపడేవి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన అయితే ప్రతీ ఒక్కరు ఇష్టపడే పథకం. ఇందులో అత్యధిక వడ్డీ శాతం ఉంది. ఆడపిల్లల భవిష్యత్తుకు ఇది ఎంతగానో మేలు చేసేది .
ఇవి కాకుండా.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. తక్కువ రిస్క్ లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే పథకాలు దీనిలో ఉన్నాయి. అవి ఏంటంటే.. కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్ పథకం. వీటి ద్వారా కూడా ఎక్కువ వడ్డీని పొందొచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.. కిసాన్ వికాస్ పత్ర లో 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. దీనిలో చేరాలంటే కేవలం రూ.100 ఉంటే సరిపోతుంది. దీనిలో సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్లు అనేవి ఉంటాయి.
18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా మైనర్లు కూడా దీనిలో చేరొచ్చు.. కాకపోతే తల్లిదండ్రలు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకోవాలంటే.. రెండున్నర ఏళ్లు ఆగాలి. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనిలో పెట్టుబడి పెడితే.. 10.5 సంవత్సరాల తర్వాత రెట్టింపు తీసుకోవచ్చు. ఇక రెండోది..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్.
6.8 శాతం వడ్డీ ఉంటుంది. ఖాతాను తెరవడానికి మీరు కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవ్వాలంటే.. 10.7 సంవత్సరాలు పడుతుంది. మరో పథకం.. నెలవారీ ఆదాయ పథకం. దీనిని కూడా రూ.1000తో ఖాతా తెరవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లిస్తారు. డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 11 నెలల సమయం పడుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…