Imandi Ramarao : లైగర్ మోవీ దెబ్బతో పూరీ జగన్నాథ్ ఆస్తుల అమ్మకాలు..? : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Imandi RamaRao : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘లైగర్’ సినిమా ఆశించినంత విజయం పొందలేదు. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటి సారి పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమా తో అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్ ఆధారపడింది. అయితే సినిమా మాత్రం జనాలకు చాలా మందికి అంతగా ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ లో ఇంకొంచం బెటర్ గా ఉండుంటే బాగుండేది అనే టాక్ వినిపించింది. మొత్తానికి సినిమాకు పెద్దగా వసూళ్లు రాలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయారు. ఇక డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని పూడ్చడానికి నిర్మాతలుగా ఉన్న పూరి, ఛార్మి ప్రయత్నిస్తున్నారు.

పూరి ఆస్తుల అమ్మకం…

లైగర్ సినిమ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యుంటే మళ్ళీ పూరి జగన్నాథ్ కెరీర్ గాడిలో పడుండేది. ఇక విజయ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయేది. కానీ అదేమి జరగకుండా సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు విజయ్, పూరి కాంబినేషన్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ గా వస్తున్న ‘జనగణమన’ సినిమాను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూరి డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం చేయడం కోసం తన ఆస్తులను కరిగిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక వీటిపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడుతూ ఒకప్పుడు పూరి ఆస్తులను అమ్ముకున్నాడు.

ఆ తరువాత మళ్ళీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కొన్నాడు. మళ్ళీ ఇప్పుడు లైగర్ వల్ల కోట్ల ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మళ్ళీ ఒక మంచి హిట్ ఇచ్చి మళ్ళీ కొనగలడు. అందుకే పూరి ఇటువంటి వాటికి పెద్దగా భయపడడు అంటూ చెప్పారు ఇమంది. ఇక విజయ్ ‘జనగణమన’ సినిమాను రద్దు చేసుకున్నాడు ఛార్మి, పూరి తో టచ్ లో లేడు అనేది అవాస్తవం. విజయ్ తండ్రితో స్వయంగా నేను మాట్లాడాను వారికి అయినంత సహాయం ఖచ్చితంగా చేస్తాము అంటూ చెప్పారు కాబట్టి విజయ్ వారికి దూరంగా ఉన్నాడన్నది తప్పు. ఇక ఒకవేళ మంచి ప్రొడ్యూసర్ దొరికితే ఖచ్చితంగా మళ్ళీ జనగణమన సినిమా చేస్తారు అంటూ ఇమంది చెప్పారు.