Actress Sangeetha: ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగుతో ఖడ్గం సినిమా ద్వారా అందరిని మెప్పించారు నటి సంగీత. ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత అనంతరం ఖుషి ఖుషి సంక్రాంతి పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాలలో నటించి నటిగా సందడి చేశారు.ఇలా పలు సినిమాలలో నటించిన సంగీత చివరిగా కారా మజాకా అనే చిత్రంలో నటించి తెలుగు తెరకు దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరికెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ సినిమాలో రష్మిక తల్లి పాత్రలో సంగీత నటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగీత తాజాగా ఈమె నటించిన మసూద్ అనే హర్రర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఓ బుల్లితెర కార్యక్రమంలో సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సినిమా మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అని యాంకర్ ప్రశ్నించగా ఈ సినిమా వల్ల తనకు పెద్దగా ప్రయోజనం కలగలేదని సమాధానం చెప్పారు. ఇప్పటికీ ఈ సినిమా డైరెక్టర్ ను తాను తిట్టుకుంటానని ఈమె వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమా చేసే ముందు డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చే తనకు కథ వివరించారని, ఇప్పుడు కనుక డైరెక్టర్ కనపడితే రేయ్ నన్ను ఇలా చేసావ్ ఏంట్రా అని తిడతానంటూ ఈ సందర్భంగా ఈమె ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో సంగీత రష్మిక తల్లిగా ‘అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…