కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నారా.. రూ.4 లక్షల తగ్గింపు పొందే ఛాన్స్..?

దేశంలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న ఖర్చుల వల్ల కొత్త ఇల్లును కొనుగోలు చేయడం అంత తేలిక కాదు. అయితే కేంద్రం మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవాళ్లకు మాత్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సెక్షన్ 80ఈఈ కింద ఆదాయపు పన్ను చట్టం కింద కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేవాళ్లకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టం ద్వారా సెక్షన్ 24 ప్రకారం 2 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మినహాయింపుతో పాటు హోమ్ లోన్ పై చెల్లించే వడ్డీపై కూడా పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. పూర్తిగా హోమ్ లోన్ చెల్లించే వరకు కూడా ఈ పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు మాత్రమే పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

ఇంటి విలువ 50 లక్షల రూపాయల లోపు ఉండటంతో పాటు ఇంటి కొరకు తీసుకున్న రుణం 35 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్నవాళ్లు ఈ ప్రయోజనం పొందవచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఇంటిని కొనుగోలు చేసిన వాళ్లు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎవరైతే జాయింట్ లోన్ ను తీసుకుంటే ఇద్దరూ పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ రెండు ప్రయోజనాలతో పాటు కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవాళ్లు మరో బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80ఈఈ కింద ఈ స్కీమ్ ద్వారా 50 వేల రూపాయల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇంటి కొనుగోలుదారులు ఈ విధంగా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.