Nagarjuna: చైతన్య సమంత విడిపోయిన నాగార్జున అది అలాగే పెట్టారా… ఏమైందంటే?

Nagarjuna: అక్కినేని నాగచైతన్య సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో వీరిద్దరూ కూడా ఎంతో ఘనంగా 2017 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు వైవాహిక జీవితంలోకి ఎంతో సంతోషంగా ఉన్నారు. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరి పెళ్లిని కాస్త బ్రేకప్ చేసుకున్నారు.

నాగచైతన్య సమంత 2021 అక్టోబర్ లో వీరి విడాకుల గురించి అధికారికంగా ప్రకటన ఇచ్చారు. ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం కెరియర్ పరంగా ఇద్దరూ కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే వీరిద్దరూ విడిపోయి కూడా దాదాపు మూడు సంవత్సరాలు దాటినప్పటికీ తరచూ సమంత నాగచైతన్య గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా సమంత నాగచైతన్యకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయిన నాగార్జున మాత్రం వీరి విషయంలో ఒక వస్తువుని అలాగే భద్రంగా దాచి పెట్టారని తెలుస్తుంది. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబం నుంచి వెళ్లిపోయిన వీరి పెళ్లి ఫోటోని మాత్రం నాగార్జున తన ఇంటి హాల్లో అలాగే పెట్టారని తెలుస్తుంది.

ఫ్యామిలీ ఫోటో…


నాగార్జున ఇలా సమంత నాగచైతన్య ఫోటో పెట్టడానికే కారణం ఏంటి అనే విషయానికి వస్తే సమంత నాగచైతన్య పెళ్లిలో మాత్రమే అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసారని ఈ పెళ్లిలోనే వీరంతా కలిసి ఫ్యామిలీ ఫోటో దిగారని తెలుస్తోంది. ఇలా ఈ ఫోటోలో కుటుంబ సభ్యులందరూ కూడా ఉండటంతో ఈయన కూడా ఈ ఫోటోని భద్రంగా పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి.