Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు నటుడు విజయ్ దేవరకొండ .ఈయన హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నటుడుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈయనకు మాత్రం అభిమానుల సంఖ్య భారీగా పెరిగిపోయింది ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తర్వాత అభిమానులు ఎక్కువగా ఫాలో అయ్యే టాలీవుడ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా 20 మిలియన్ ఫాలోవర్స్ లో సొంతం చేసుకున్నారు. అయితే ఈయన మాత్రం శరవేగంగా రామ్ చరణ్ రికార్డును బ్రేక్ చేసి 21 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా విజయ్ దేవరకొండ రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ రికార్డులను బ్రేక్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకోవడంతో పలువురు అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ విజయ్ దేవరకొండ మామూలు వ్యక్తి కాదు ఈయనకు భారీ స్థాయిలో క్రేజ్ ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే ఈయన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఫ్యామిలీ స్టార్…
దిల్ రాజు నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటి మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు ఈ సినిమా వేసవి సెలవులను పురస్కరించుకొని ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…