Shiva : అబద్ధాలతో మొదలై అఖండ విజయం సాధించిన తెలుగు ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ మూవీ.!!

హైదరాబాద్ అమీర్ పేట్ లో సినిమా క్యాసెట్ లు అద్దెకు ఇచ్చే ఒక షాపు నడుపుతున్న ఓ పాతికేళ్ల యువకుడు. తోటి స్నేహితుల కంటే భిన్నంగా ఆలోచించే మనస్తత్వం.. అంతకుమించి సినిమా అంటే పిచ్చి. తండ్రి అన్నపూర్ణ స్టూడియోలో ఆడియో విభాగంలో పనిచేస్తున్నప్పటికీ.. కొడుకు రామ్ గోపాల్ వర్మను ఇతర దేశాలకి పంపించి సివిల్ ఇంజనీర్ గా చూడాలని కళలు కనేవాడు. ఫారెన్ వెళ్లే ఛాన్సులు వచ్చినప్పటికీ ఆ యువకుడు సినిమాని అభిమానిస్తూ ఎలాగైనా దర్శకుడు కావాలని పట్టుదలతో ఉన్నాడు.

Shiva : అబద్ధాలతో మొదలై అఖండ విజయం సాధించిన తెలుగు ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ మూవీ.!!

అలా ఒక రోజు ఏఎన్ఆర్ అల్లుడు, నాగార్జున భావగారైన యార్లగడ్డ సురేంద్ర తెలుగు సినిమా క్యాసెట్ల కోసం అమీర్ పేటలో ఈ యువకుడి షాప్ కు రావడం జరిగింది. ఆ యువకుడు తన దగ్గర ఉన్న కథలను ఏవేవో చెప్తూ ఆయనను తరుచు విసిగించే వాడు. అయితే గతంలో ఆర్జీవీ క‌లెక్ట‌ర్ గారి అబ్బాయి సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశారు. ఆ త‌ర‌వాత రావుగారిల్లు సినిమాకు కూడా అసిస్టెంట్ గా ప‌నిచేశాడు. ఈ సినిమా స‌మ‌యంలోనే నాగార్జునతో వ‌ర్మ‌కు ప‌రిచ‌యం ఏర్పడింది. ఆ త‌ర‌వాత “రాత్రి” (సినిమా) అనే క‌థ‌ను అల్లి నాగార్జునకు వినిపించాడు. కానీ నాగ్ అంత‌గా ఇంప్రెస్ అవ్వ‌లేదు. ఆ త‌ర‌వాత త‌ను చదువుకున్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటనలను మరియు బాలీవుడ్ సినిమాల్లోని కాలచక్ర, అర్జున్ హాలీవుడ్ మూవీ ‌ఎంటర్ ది డ్రాగన్ లోని కొన్ని సన్నివేశాలను ఆధారం చేసుకుని ఒక క‌థ‌ను త‌యారు చేశాడు ఆర్జీవీ… అలా చెప్పడం తప్పే అయినప్పటికీ ‌ వెండితెరపై దర్శకుడిగా తన పేరు చూసుకోవాలన్న ఆశ ఆర్జివి తో ఇలా చేయించింది.

మీ నాన్నగారు నాగేశ్వరరావు క‌థ‌(శివ) బాగుందన్నారని నాగార్జునకు వినిపించారు. అలాగే అదే స్టొరీని (శివ) నాగార్జున బాగుందన్నారని నాగేశ్వరరావుకు వినిపించారు. నిజమే కావచ్చని ఆ తండ్రి కొడుకులు ఆమోదించడంతో ఇక అదే క‌థ‌ను రచయిత త‌నికెళ్ల‌బ‌ర‌ణికి కూడా వ‌ర్మ వినిపించారు. ఈ క‌థ విన్న త‌నికెళ్ల‌భ‌రణి కూడా ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. అప్పటికే కొన్ని సినిమాల‌కు డైలాగ్ రైట‌ర్ గా పనిచేసిన త‌నికెళ్ల‌భ‌ర‌ణిని శివ సినిమాకు డైలాగులు రాయ‌మ‌న్నారు.

దాంతో ఆయ‌న క‌థ‌ను బ‌ట్టి కొన్ని కామెడీ డైలాగుల‌ను కూడా రాశారు. కానీ వ‌ర్మ క‌థ‌లో ఒక్క కామెడీ సీన్ కూడా ఉండ‌ద‌ని చెప్పార‌ట‌. దాంతో త‌నికెళ్ల‌భ‌ర‌ణి ఈ సినిమా ఆడిన‌ట్టే అని మ‌న‌సులో అనుకున్నార‌ట‌. అంతే కాకుండా వీడికేమైనా పిచ్చా అని కూడా అనుకున్నార‌ట‌. కానీ ఆర్జీవి కోరిన‌ట్టుగా మాట‌లు రాసి ఆ బౌండ్ స్క్రిప్ట్ ను సి.వి.ఎల్. నరసింహరావు ద్వారా చెన్నై నుండి హైదరాబాద్ కు పంపించారు.

అది తీసుకున్న వర్మ ఒక బౌండ్ స్క్రిప్ట్ థర్డ్ పర్సన్ తో ఎలా పంపిస్తావని తనికెళ్ల భరణిని ఏకిపారేశారు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా అమ‌లను అనుకున్నారు. అంతే కాకుండా విల‌న్ పాత్ర కోసం ర‌ఘువ‌రుణ్ ను తీసుకున్నారు. భ‌వాని అనే పాత్ర‌లో ర‌ఘువ‌రుణ్ న‌టించిన తీరుకు ప్ర‌శంస‌లు కురిశాయి. ఈ సినిమా మొత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. చివ‌రి మూడు రోజులు మాత్రమే మ‌ద్రాస్ షూట్ చేసిన‌ట్టు స‌మాచారం. సినిమా రీరికార్డింగ్ కు ముందు చూసిన నిర్మాత‌లు కూడా సినిమా ఫ్లాప్ అనుకున్నారు. టైటిల్ విష‌యంలో కూడా పెద‌వివిరిసారు. ఒక్క నాగార్జున తప్ప మిగతా టెక్నీషియన్స్ ఎవరు ఈ సినిమాపై నమ్మకం పెట్టుకోలేదు. అలా తెర‌కెక్కిన శివ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది.