Featured

Flash Back : 1994 జనవరిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో అనుకోకుండా ఒక చిత్రం ముందుకు దూసుకు వచ్చింది.?!

ఆ సంవత్సరంలో స్టార్ హీరోలైన కృష్ణ, చిరంజీవి, నాగార్జున బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేశారు. సంక్రాంతి కానుకగా ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను సందడి చేశాయి. అందులో ముందుగా విడుదలైన “ముగ్గురు మొనగాళ్ళు” 1994, జనవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. 

అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, నగ్మా, రమ్యకృష్ణ, రోజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో చిరంజీవి మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేశాడు. రంగనాథ్, శ్రీవిద్య తమ కుమారులు పృథ్వీ, విక్రమ్, దత్తాత్రేయ (చిరంజీవి త్రిపాత్రాభినయం)లతో ఒక గ్రామంలో నివసిస్తున్నారు. ఒక కేసు విషయంలో రంగనాథ్ ను శరత్ సక్సేనా చంపివేస్తాడు.

గర్భవతి అయిన శ్రీవిద్య పారిపోతూ పృథ్వీ నుండి విడిపోతుంది. గూండాల నుండి తప్పించుకునేటప్పుడు తన కొడుకు చంపబడ్డాడని అనుకుంటుంది. ఒక ఆలయంలోకి వెళ్ళి అక్కడ కవలలకు జన్మనిస్తుంది. సంతానం లేని పూజారి ఒక కొడుకును దత్తత తీసుకుంటాడు, శ్రీవిద్యతో ఉన్న విక్రమ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవుతాడు. దత్తాత్రేయ నృత్య ఉపాధ్యాయుడు. సోదరులు ఒకరినొకరు, తల్లిని ఎలా కలిసారు, విలన్లపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు అనేది మిగతా కథ.

నెంబర్ వన్ 1994 జనవరి 14 న విడుదలైన తెలుగు చిత్రం.ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం, సంగీతం, దర్శకత్వం ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి అందించారు.ఈ చిత్ర గీతాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కృష్ణ, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించారు. సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ శ్రీ షిర్డీ సాయి ఫిల్మ్స్…. తల్లితండ్రులు చనిపోగా అనాథగా మారిన ఒక కుటుంబాన్ని పెద్ద కుమారుడు ఎలా పోషించి ప్రయోజకత్వం సాధించాడనేది కథ. పెద్ద కుమారుడిగా ఘట్టమనేని కృష్ణ నటించారు. కృష్ణ ఇందులోని పాటలలో శివాజీ తదితర వేషాలలో కనిపించారు.

తిరుమల ఆలయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
1994 జనవరి 21 రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో “గోవిందా గోవిందా” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. త్రేతా యుగం, కలియుగం మధ్య కాలంలో శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వరుడిగా ఎందుకు భూమి వెలశాడో తెలిపే కథతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కథ ప్రస్తుతం లోకి వస్తే బ్యాంకాక్ లోని ఓ తాంత్రికుడు వేంకటేశ్వరుడి కిరీటానికి ఓకన్యను బలి ఇవ్వడం ద్వారా, టెలి కైనెసిస్ అనే ప్రక్రియ ద్వారా లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

తిరుమల ఆలయంలోని ఆ కిరీటాన్ని దొంగిలించే బాధ్యత ముంబై లో పేరుమోసిన దొంగయైన పరేష్ అనే వ్యక్తికి అప్పగిస్తాడు. చిన్నప్పటి నుంచి బ్యాంకాక్ లో పెరిగిన నవీన అనే యువతి తన తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో భారతదేశంలో తాడేపల్లి గూడెంలో ఉన్న తన బామ్మను వెంటతీసుకుని వెళ్ళడానికి వస్తుంది… ఆ సంవత్సరం జనవరి నెలలో ఒక వారం తర్వాత మరొక చిత్రం బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చాయి.. నాగార్జున హీరోగా నటించిన “గోవిందా గోవిందా ” చిత్రం పరాజయం పొందింది, మెగాస్టార్ నటించిన “ముగ్గురు మొనగాళ్ళు” “యావరేజ్ హిట్ గా నిలవగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన “నెంబర్ వన్” చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago