Balakrishna: సాధారణంగా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయడం సర్వసాధారణం ఈ క్రమంలోనే వివిధ భాషలలో మంచి విజయాలను అందుకున్న చిత్రాలను ఇతర భాషలలో రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నందమూరి తారకరామారావు ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలు పౌరాణిక చిత్రాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఈయన బాటలోనే ఆయన వారసుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మరిన్ని విజయాలను అందుకున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ నటించిన పలు క్లాసికల్ చిత్రాలను బాలకృష్ణ రీమేక్ చేశారు. మరి ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో బాలకృష్ణ ఏ ఏ సినిమాలను రీమేక్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం…ఎన్టీఆర్ హీరోగా కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన నర్తనశాల చిత్రాన్ని బాలకృష్ణ ‘శ్రీ మద్విరాట పర్వము’ పేరుతో రీమేక్ చేసారు.
అలాగే ఎన్టీఆర్ నటించిన వద్దంటే డబ్బు సినిమాని కొద్దిగా మార్పులు చేసి జంధ్యాల దర్శకత్వంలో బాబాయ్ అబ్బాయి అనే సినిమాని చేసి మంచి హిట్ అందుకున్నారు. అలాగే ఎన్టీఆర్ రాముడు భీముడు అనే సినిమాని బాలకృష్ణ కథలో కొన్ని మార్పులు చేసి రాముడు భీముడు అనే టైటిల్ తో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.
ఎన్టీఆర్ నటించిన గులేబకావళి కథ’, ‘జగదేకవీరునికథ’, ‘రాజపుత్ర రహస్యం’ వంటి సినిమాల నుంచి కొద్దిగా కథను తీసుకొని భైరవద్వీపం కథ తెరకెక్కించారు. బాలకృష్ణ సినీ కెరీయర్ లో భైరవద్వీపం మంచి హిట్ అందుకుంది.ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమానీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ పాండురంగడు సినిమాగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాలో కొంత భాగం ఆధారంగా చేసుకొని శ్రీకృష్ణార్జున విజయము అనే సినిమాని తెరకెక్కించారు. ఎన్టీఆర్ లవకుశ చిత్రాన్ని బాలకృష్ణ శ్రీరామరాజ్యంగా రీమేక్ చేశారు. అలాగే ఎన్టీఆర్ జీవిత కథాంశంతో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహా నాయుడు అనే సినిమాలలో కూడా బాలకృష్ణ నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…