‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాలోని హీరో ఒకప్పటి చిరంజీవి చిత్రంలోని బాలనటుడే.!!

బాల నటీనటులుగా వచ్చిన వారంతా పెద్దవారయ్యాక హీరోగా లేదా హీరోయిన్ గా మారిన సందర్భాలు ఉన్నాయి. నాటితరం కమల్ హాసన్, బాలకృష్ణ, శ్రీదేవి, రోజారమణి నేటితరం మీన, రాశి, తరుణ్, బేబీ షామిలి లాంటి ఎంతోమంది భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సినిమా ఒకరికి నల్లేరు మీద నడక అయితే మరొకరికి ముళ్లబాటగా నిలిచింది. ఇదంతా చిత్ర పరిశ్రమలో సహజమే. 2005 క్రియేటివ్ కమర్షియల్స్, శ్రీధరరావు నిర్మాణం, శేఖర్ సూరి దర్శకత్వంలో ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమా విడుదలైంది.

ఈ సినిమాలో రాజీవ్ కనకాల,రిచర్డు రిషి, మోనాచోప్రా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కథాపరంగా హీరోగా రిచర్డ్ రిషి, దర్శకుడిగా రాజీవ్ కనకాల, రచయితగా గజల్ శ్రీనివాస్ నటించారు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం భయానక్ అనే పేరుతో హిందీలోకి అనువాదం కాబడింది. రెండు విజయవంతమైన చిత్రాల అనంతరం రిషి, రాజీవ్ కనకాల మూడవ సినిమా కోసం ఒక రచయిత చెప్పిన కథను ఉల్లాసంగా చెప్పుకుంటూ జాలిట్రిప్ గా వాహనంలో బయటికి వెళ్తారు. ఆ క్రమంలో రచయిత చెప్పిన కథ ఏదైతే ఉందో అదే నిజజీవితంలో జరుగుతూ.. ప్రేక్షకులకు ఆసక్తి రేపుతుంది.

ఇద్దరికీ దారి మధ్యలో కలిసిన ఓ మహిళ (హీరోయిన్) ఏ విధంగా వారితో జర్నీ కొనసాగిస్తుంది. ఆ ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తుంది చివరికి ఎవరినీ హత్య చేస్తుందనేది మిగతా కథాంశం. అయితే ఇందులో నటించిన రీఛార్జ్ రిషి ఎవరో కాదు ఒకప్పుడు ‘అంజలి’ చిత్రంలో బాలనటిగా నటించిన బేబీషామిలి కి స్వయానా సోదరుడు.

ప్రముఖ తమిళ నటుడు అజిత్ ను పెళ్లి చేసుకున్న షాలిని కూడా రిచర్డ్ రిషి కి మరో సోదరిగా చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు కలిసి రిచర్డ్ రిషి, శాలిని, శ్యామిలి బాలనటీనటులుగా 1990, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జగదేకవీరుడు అతిలోకసుందరిలో నటించారు. ఈ చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఈ బాల నటులతోనే సినిమా కథ మలుపు తిరుగుతుంది.

స్వర్గంలో ఉన్న దేవకన్య శ్రీదేవి భూలోకానికి దిగివస్తుంది. ఆ క్రమంలో దేవకన్య ఆయన శ్రీదేవి చేతివేలు ఉంగరాన్ని తను దిగిన చోటైనా హిమాలయాల్లో పోగొట్టుకుంటుంది. తిరిగి తన ఉంగరాన్ని పొంది దేవలోకం వెళుతుందా లేదా శాశ్వతంగా భూలోకంలోనే ఉంటుందా.. అన్నది మిగతా కథాంశం. ఆ తరువాత హీరో రిచర్డ్ రిషి భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, బంగారు కొండ, మహారాజశ్రీ, దమ్మున్నోడు, అడవి కాచిన వెన్నెల, డాక్టర్ చక్రవర్తి, వీడు మామూలోడు కాదు లాంటి చిత్రాల్లో నటించారు.