ఫన్ బకెట్ భార్గవ్ టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే టిక్ టాక్ లో వీడియోలు చూస్తూ సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఇతను ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే,అంతేకాకుండా ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి కావడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో ఫన్ బకెట్ భార్గవ్ విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఎటు చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోయింది.
అలాగే ఈ విషయంపై భార్గవ్ తో సంబంధం ఉన్న కొందరు అతనికి సంబంధించిన కొన్ని విషయాలను మీడియాకు వెల్లడించారు.అయితే ఈ సోషల్ మీడియా ద్వారా అయితే మంచి పాపులారిటీ సంపాదించు కున్నాడో, అదే సోషల్ మీడియా లో అతన్ని ఎంతగానో అభిమానించే తన ఫాలోవర్స్ కూడా అతను చేసిన పనికి దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ, అతనినే ఎన్ని విధాలుగా తిట్టవచ్చో అన్ని విధాలుగా తిట్టారు.
ఫన్ బకెట్ భార్గవ్ ను విశాఖ సిటీ దిశా ఏసీపి ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపారు. దిశ,ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి భార్గవ్ హైదరాబాదులో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. 94 రోజులు డిమాండ్ ఖైదీ గా ఉన్న భార్గవ్ ఇటీవలే బెయిల్ పై వచ్చిన విషయం తెలిసిందే.బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పలు వీడియోలు చేస్తూ తాను నిర్దోషి అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా ముందులాగే సపోర్ట్ చేయమని చెబుతూ వీడియోలు కూడా చేశాడు.
ఈ నేపథ్యంలోనే నెటిజన్లు అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ఇలా ఉంటే బెయిల్ పై వచ్చిన తర్వాత షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను భార్గవ్ ఉల్లంఘించాడు. దీనితో మరొకసారి భార్గవ్ పై దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ చేశారు. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్లు మెమోలో పొందుపరిచారు పోలీసులు. దీనితో ఫోక్సో కోర్టు బెయిల్ రద్దు చేసి ఈ నెల 11 వరకు రిమాండ్ విధించడంతో మరొకసారి జైలు పాలయ్యాడు భార్గవ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…