భారత సినీ పరిశ్రమ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన చనిపోయారు అంటే నమ్మ బుద్ధి కావడం లేదు.పునీత్ అకాల మరణం అతని కుటుంబ సభ్యులను, అతని అభిమానులను ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టేసింది. అతన్నికడసారిగా చూసేందుకు లక్షలాది మంది అభిమానులు కంఠీరవ స్టూడియో దగ్గరికి చేరుకుని అతనికి నివాళులు అర్పించారు.
అతని మరణ వార్త విని ఏకంగా ఒక అభిమాని గుండె పోటుతో మరణించాడు. పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంటే మరొకవైపు అతని మరణాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బెంగుళూరు లోని ఒక డయాగ్నస్టిక్ సెంటర్ పునీత్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూనే అతని మరణాన్ని క్యాష్ చేసుకుంటోంది.
పునీత్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా అందరికీ గుండె అలాగే ఇతర చెకప్ లు ఫ్రీగా చేస్తాము అని ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. అయితే ఇంతవరకు బాగున్నా ఆ ఫ్లెక్సీ లో కిందవైపు మా వద్దకు బిపి, ఈసీజీ, క్రియాటిన్ లెవెల్స్, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకుంటే కేవలం 300 రూపాయలు మాత్రమే అంటూ యాడ్ చేసింది.
దీంతో ఈ యాడ్ ఫై పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున మండి పడుతున్నారు.ఈ యాడ్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మంచి మనిషి మరణాన్ని మీరు ఈ విధంగా క్యాష్ చేసుకుంటారా అంటూ పలువురు పెద్ద ఎత్తున డయాగ్నస్టిక్ సెంటర్ పైన విరుచుకుపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…