“రంగస్థలం” సినిమా అసలు కథకు హీరో చిరంజీవినే.. నమ్మకపోతే ఇది చూడండి..!!

రామ్ చరణ్ వైవిధ్యమైన కథలతో అనతికాలంలోనే తండ్రి చేత శభాష్ అనిపించుకున్న నటుడుగా చెప్పుకోవచ్చు. చిరుత సినిమాతో కాస్త తడబడ్డా.. మగధీరతో సత్తా చాటాడు. ఏకంగా రంగస్థలం సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపాడు. విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ఎన్ని మార్కులు వేసిన తక్కువే. నిజంగా రామ్ చరణ్ తన నటనతో అందరిని విస్మయానికి గురిచేశాడంటే అతిశయోక్తి కాదు. తనేంటో పూర్తిగా ఈ సినిమాతో నిరూపించుకొన్నాడు.

1980 దశకం నాటి ఓ కథను తీసుకొని సుకుమార్ చక్కటి పల్లెటూరు నేపథ్యం గల చిత్రాన్ని రూపొందించారు. ఎంతో సహజత్వాన్ని కనబరిచే చిత్రంగా తీసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. 2018, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా విడుదలయ్యింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. నటించారనేకంటే ఒక విధంగా జీవించారని చెప్పవచ్చు. అంతకు ముందులేని కొత్తదనాన్ని, అంతకుమించి సహజత్వాన్ని ఉట్టిపడేలా సుకుమార్ ఈ సినిమాని ఒక దృశ్య కావ్యంలా చిత్రీకరించాడు.

దర్శకుడు సుకుమార్ సినిమా చిత్రీకరించాడనేకంటే మనసుపెట్టి తీశాడనేది సరైందనిపిస్తుంది.
ఆ మధ్య కాలంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దర్శకుడు ‌ధవళ సత్యంతో “రంగస్థలం” సినిమా చూడమని చెప్పారు. తీరా వెళ్లి రంగస్థలం సినిమా చూస్తే ఒకప్పుడు తాను చిరంజీవితో తీసిన సినిమా నే ఆయనకు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆయన బయటకు వచ్చి అల్లు అరవింద్ తో ఒకప్పుడు తాను రూపొందించిన చిత్రమే రంగస్థలం అని చెప్పారు.

1980, సౌమ్య సినీ ఆర్ట్స్, దవళ సత్యం దర్శకత్వంలో జాతర అనే సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో చిరంజీవి, ఇంద్రాణి హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు శ్రీధర్, సువర్ణ ప్రధాన పాత్రలు పోషించారు.

రంగస్థలం చిత్రంలో హీరో రామ్ చరణ్ కి అన్నగా ఆదిపినిశెట్టి నటించారు. జాతరలో చిరంజీవికి అన్నగా శ్రీధర్ నటించారు. ప్రెసిడెంట్ గా జగపతిబాబు నటించగా జాతర చిత్రంలో నాగభూషణం నటించారు. ప్రతి పనికి ముందర ప్రెసిడెంటు అమ్మవారికి పూజలు చేయడం రెండు సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. పేదవారు ప్రెసిడెంట్ దగ్గర తీసుకున్న డబ్బుకు వడ్డీ మీద వడ్డీ చెల్లించడం. చివరికి ప్రెసిడెంటు పై గ్రామ ప్రజలందరూ తిరుగుబాటు చేయడం లాంటి అనేక అంశాలు రెండు చిత్రాల్లో కనబడడం గమనార్హం.. అయితే దర్శకుడు ధవళ సత్యం చెప్పిన విధంగా ఒకప్పటి తన ‌సినిమా కథకు చిరంజీవి అసలు హీరోగా చెప్పుకోవచ్చు.