రామ్ చరణ్ వైవిధ్యమైన కథలతో అనతికాలంలోనే తండ్రి చేత శభాష్ అనిపించుకున్న నటుడుగా చెప్పుకోవచ్చు. చిరుత సినిమాతో కాస్త తడబడ్డా.. మగధీరతో సత్తా చాటాడు. ఏకంగా రంగస్థలం సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపాడు. విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ఎన్ని మార్కులు వేసిన తక్కువే. నిజంగా రామ్ చరణ్ తన నటనతో అందరిని విస్మయానికి గురిచేశాడంటే అతిశయోక్తి కాదు. తనేంటో పూర్తిగా ఈ సినిమాతో నిరూపించుకొన్నాడు.
1980 దశకం నాటి ఓ కథను తీసుకొని సుకుమార్ చక్కటి పల్లెటూరు నేపథ్యం గల చిత్రాన్ని రూపొందించారు. ఎంతో సహజత్వాన్ని కనబరిచే చిత్రంగా తీసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. 2018, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా విడుదలయ్యింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. నటించారనేకంటే ఒక విధంగా జీవించారని చెప్పవచ్చు. అంతకు ముందులేని కొత్తదనాన్ని, అంతకుమించి సహజత్వాన్ని ఉట్టిపడేలా సుకుమార్ ఈ సినిమాని ఒక దృశ్య కావ్యంలా చిత్రీకరించాడు.
దర్శకుడు సుకుమార్ సినిమా చిత్రీకరించాడనేకంటే మనసుపెట్టి తీశాడనేది సరైందనిపిస్తుంది.
ఆ మధ్య కాలంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దర్శకుడు ధవళ సత్యంతో “రంగస్థలం” సినిమా చూడమని చెప్పారు. తీరా వెళ్లి రంగస్థలం సినిమా చూస్తే ఒకప్పుడు తాను చిరంజీవితో తీసిన సినిమా నే ఆయనకు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆయన బయటకు వచ్చి అల్లు అరవింద్ తో ఒకప్పుడు తాను రూపొందించిన చిత్రమే రంగస్థలం అని చెప్పారు.
1980, సౌమ్య సినీ ఆర్ట్స్, దవళ సత్యం దర్శకత్వంలో జాతర అనే సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో చిరంజీవి, ఇంద్రాణి హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు శ్రీధర్, సువర్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
రంగస్థలం చిత్రంలో హీరో రామ్ చరణ్ కి అన్నగా ఆదిపినిశెట్టి నటించారు. జాతరలో చిరంజీవికి అన్నగా శ్రీధర్ నటించారు. ప్రెసిడెంట్ గా జగపతిబాబు నటించగా జాతర చిత్రంలో నాగభూషణం నటించారు. ప్రతి పనికి ముందర ప్రెసిడెంటు అమ్మవారికి పూజలు చేయడం రెండు సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. పేదవారు ప్రెసిడెంట్ దగ్గర తీసుకున్న డబ్బుకు వడ్డీ మీద వడ్డీ చెల్లించడం. చివరికి ప్రెసిడెంటు పై గ్రామ ప్రజలందరూ తిరుగుబాటు చేయడం లాంటి అనేక అంశాలు రెండు చిత్రాల్లో కనబడడం గమనార్హం.. అయితే దర్శకుడు ధవళ సత్యం చెప్పిన విధంగా ఒకప్పటి తన సినిమా కథకు చిరంజీవి అసలు హీరోగా చెప్పుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…