సూపర్ స్టార్ కృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఒక సినిమా ఆగిపోయిందనే విషయం మీకు తెలుసా.?!

చిన్నతనంలోనే బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న ఓ పిల్లవాడు మెల్లిగా తన కలానికి పని చెప్పాడు. ఆ వయసులో కొన్ని పాత్రలను కల్పించుకుని ఒక కథ రాశాడు. తన తండ్రి కూడా పుస్తకాల పురుగు కాబట్టి, ఆ పుస్తకాలను చదువుకోవడానికి తీస్తున్న క్రమంలో ఏదో పేపర్ లో నల్లటి గీతలతో రాసిన ఒక పేపర్స్ కట్ట కనబడింది. ఆ రాత పిల్లవాడి రాతల కనిపించింది. ఓహో ఇది ఖచ్చితంగా తన కొడుకే రాసి ఉంటాడని తండ్రి మొత్తం చదివాడు. అప్పటికీ ఆ వయసులో ఆ పిల్లాడు ఓ కథ రాయడం తండ్రికి ఆశ్చర్యం అనిపించింది. పాఠశాల సమయం పూర్తయిన తర్వాత సాయంత్రం పూట తమ థియేటర్ నుంచి ఊరూరా తిరిగి సినిమా అడ్వర్టైజ్మెంట్ చేసే ఓ రిక్షా తన స్కూల్ కి వచ్చేది. దానిని ఎక్కి తిరిగి థియేటర్ కి వెళ్లి, అక్కడ ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు వేసి తర్వాత ఇంటికి వెళ్ళేవాడు.

అలా తమ కొడుకు యొక్క ఆసక్తిని గమనించి తండ్రి డబ్బులు ఇవ్వడంతో పూరి జగన్నాథ్ 1989లో హైదరాబాదులోని ఫిలింనగర్ రావడం జరిగింది. అప్పుడే విడుదలైన శివ సినిమా విడుదల అవడం జరిగింది. ఈ సినిమా ఎవరు తీశారు?.. అని అన్వేషించాడు. అలా కృష్ణవంశీ పరిచయం కావడంతో రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కృష్ణవంశీ, పూరిజగన్నాధ్ కు అవకాశం కల్పించాడు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ గులాబీ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ.. కృష్ణవంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకి పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడ‌తా సినిమాకి పనిచేస్తున్న సమయంలో రవితేజతో నిన్ను హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తానని పూరి జగన్నాథ్ చెప్పారు. నువ్వు దర్శకుడు ఎప్పుడు అవుతావో.. నన్ను హీరోగా పెట్టి సినిమా ఎప్పుడు తీస్తావో.. అని రవితేజ ఒక మాట అన్నారు.

కొత్త దర్శకులకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తున్నాడని తెలిసి చోటా కె.నాయుడు సహాయంతో పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకు బద్రి కథ చెప్పడం జరిగింది. ఆ కథకి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పడంతో..అప్పుడు పూరి జగన్నాథ్ ఎగిరి గంతేసాడు.ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో ఒక సూపర్ హిట్ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. అలా పూరి జగన్నాథ్ మొదటి సినిమాగా త్రివిక్రమరావు నిర్మాణ సారథ్యంలో బద్రి సినిమా విడుదల అయ్యింది. ఇక అప్పటినుండి పూరి జగన్నాథ్ వెనుతిరిగి చూసుకోలేదు. అయితే ఈ సినిమా కంటే ముందే పూరి జగన్నాథ్ టీవీ సీరియల్స్ కి స్క్రిప్టు రాసేవాడు. కొన్ని మ్యాగజైన్స్ కి బొమ్మలు గీస్తూండేవాడు.

ఆ క్రమంలో ఐ.బి.కె మోహన్ పూరి జగన్నాథ్ ను గమనించి ఆయనతో ఒక సినిమా తీద్దాం అనుకున్నాడు. ఆ క్రమంలో కృష్ణ గారిని సంప్రదించి కథ చెప్పడంతో ఆయన ఓకే అన్నారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్,కృష్ణ కాంబినేషన్ లో థిల్లాన అనే చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది.కానీ బడ్జెట్ విషయంలో నిర్మాత వెనుకంజ వేయడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి కృష్ణ సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా పోకిరి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.