IPL 2024: ప్రపంచ కప్ హీరోలపై దృష్టి పెట్టిన ఐపీఎల్ ప్రాంచైజీలు… ఆసీస్ పైనే పూర్తి దృష్టి?

IPL 2024: ఐపీఎల్ 2024 కోసం ఇప్పటికే అన్ని జట్టులో సిద్ధమవుతున్నాయి. అయితే త్వరలోనే ఐపీఎల్ సీజన్ కోసం దుబాయ్ లో వేలం జరగనుంది ఈ క్రమంలోనే ప్రపంచ కప్ క్రికెట్లో పెద్ద ఎత్తున పోటీపడి ఆట తీరును కనబరిచిన ఆటగాళ్లపైన ఈసారి ప్రాంచైజీలు పూర్తి దృష్టి పెట్టాయని తెలుస్తుంది. ఈ ఐపీఎల్ కోసం ఈ నెల 19వ తేదీ వేలం జరగబోతుంది.

అందుతున్న సమాచారం ప్రకారం దుబాయిలో జరగబోయే ఈ వేలం పాటలో పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపించబోతున్నారని తెలుస్తుంది.ముఖ్యంగా ప్రపంచ కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై అందరూ చూపు పడిందని తెలుస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ను తమ జట్టులోకి తీసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.

భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా ప్రపంచ కప్ పోటీలలో అద్భుతమైన ఆట తీరును కనబరిచారు ఈయన కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్  సారథ్యంలో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది దీంతో ఈయనపై కూడా ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించబోతున్నాయని తెలుస్తోంది.

వరల్డ్ కప్ ఆటగాళ్లపై కాసుల వర్షం..

న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌లు 2 సార్లు తలపడ్డాయి. లీగ్ రౌండ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఈ ఐపీఎల్ వేలంలో డారెల్ మిచెల్‌ భారీ ధర పలకవచ్చు. వీరితో పాటు గెరాల్డ్ కోయెట్జీ, ట్రావిస్ హెడ్ తదితర ఆటగాళ్ల పై భారీ స్థాయిలోనే ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.