Shakila: సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉండడం సర్వసాధారణం ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి అవకాశాలు రావాలి అంటే కొంతమంది దర్శక నిర్మాతలు కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు అయితే చాలామంది ఇలాంటి వాటిని రిజెక్ట్ చేయడం మరికొందరు తప్పనిసరి పరిస్థితులలో కమిట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఇదివరకే ఎంతో మంది బహిరంగంగా మాట్లాడిన సందర్భాల్లో ఉన్నాయి.
తాజాగా నటి షకీలా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి హాజరై ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్నటువంటి కమిట్మెంట్స్ గురించి కూడా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లరి నరేష్ తండ్రి ప్రముఖ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ తనని కమిట్మెంట్ అడిగారు అంటూ ఈమె కామెంట్ చేశారు.
ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తాను ఒక సినిమాలో నటించానని అయితే ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఆయన నన్ను కమిట్మెంట్ అడిగారని తెలిపారు. తనకోసం గదికి రావాలని ఇలా గదిలోకి వస్తే మరో సినిమాలో కూడా అవకాశం కల్పిస్తానని ఆయన చెప్పినట్లు ఈమె తెలిపారు.ఆ సమయంలో తాను మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నటించినందుకు మీరు డబ్బులు ఇచ్చారు నాకు మరొక సినిమాలో ఛాన్స్ అవసరం లేదు అంటూ మొహం మీదే చెప్పానని షకీలా తెలిపారు.
సినిమా అవకాశమిస్తానని చెప్పారు…
ఈ విధంగా ప్రముఖ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గురించి షకీలా చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే నేను ఈ విషయాన్ని ఏ హీరో అడిగినా చెబుతాను అంటూ కూడా ఈమె సవాల్ చేశారు అయితే కొందరు మాత్రం ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ చనిపోయినటువంటి డైరెక్టర్ పట్ల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…