Aamir Khan: అమీర్ ఖాన్ మహాభారతం కాన్సెప్ట్ ను రిజెక్ట్ చేసిన రాజమౌళి… కారణం అదేనా?

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న అమీర్ ఖాన్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలకు పెద్ద అభిమాని. మగధీర సినిమా నుంచి అమీర్ ఖాన్ రాజమౌళికి అభిమానిగా మారిపోయి ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి ఒక్క సినిమాని తప్పనిసరిగా చూస్తారు.

Aamir Khan: అమీర్ ఖాన్ మహాభారతం కాన్సెప్ట్ ను రిజెక్ట్ చేసిన రాజమౌళి… కారణం అదేనా?

ఇలా మగధీర సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న బాహుబలి సినిమా చూసి ఫిదా అయిన అమీర్ ఖాన్ ఓసారి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను కలిసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తెలియజేశారు. మహాభారతం అంటే తనకు ఎంతో ఇష్టమని మహాభారతం కథను సిద్ధం చేయాలని అమీర్ ఖాన్ విజయేంద్రప్రసాద్ ను అడిగినట్లు ఓ సందర్భంలో విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.

Aamir Khan: అమీర్ ఖాన్ మహాభారతం కాన్సెప్ట్ ను రిజెక్ట్ చేసిన రాజమౌళి… కారణం అదేనా?

ఇక మహాభారతం కథ సిద్ధం చేయాలంటే చాలా సమయం పడుతుంది. మహాభారతం 5,6 భాగాలు ఉంటుంది. అంత స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి తనకు సమయం లేదని ఇతర కమిట్మెంట్స్ వల్ల ఆ స్క్రిప్ట్ తయారు చేయలేకపోతున్నానని విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఇక ఈ విషయం గురించి రాజమౌళిని అమీర్ ఖాన్ సంప్రదించారనీ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

ఇతర సినిమాల కమిట్మెంట్స్ వల్లే…

రాజమౌళి దర్శకత్వంలో మహాభారతం సినిమాలో తాను నటించాలని ఉందని ఆ సినిమాని డైరెక్ట్ చేయాలని అమీర్ ఖాన్ కోరారు.అయితే మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అలాంటి ఒక అద్భుతమైన సినిమాని చేయటానికి ఇంకా తాను సిద్ధంగా లేనని అలాంటి సినిమా చేయాలంటే కొంత సమయం పడుతుందని రాజమౌళి అమీర్ ఖాన్ కి చెప్పినట్లు విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.ఈ విధంగా రాజమౌళి పై ఉన్న అభిమానంతో అలాగే మహాభారతంపై ఉన్న ఇష్టంతో అమీర్ ఖాన్ వీరిద్దరిని సంప్రదించడంతో ఇతర సినిమాలకు కమిట్ మెంట్ ఇవ్వడం వల్లే ఈ సినిమాని చేయలేకపోతున్నామని వీరిద్దరు అమీర్ ఖాన్ మహాభారతం సినిమా రిజెక్ట్ చేసినట్లు విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.