Narendra Modi: నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగిన ఇటలీ పిఎం జార్జియా మెలోని!

Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా దుబాయిలో జరిగినటువంటి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్.. కాన్ఫెరెన్స్ ఆఫ్‌ పార్టీస్‌ (COP28) 28వ సమ్మిట్ కు హాజరైన సంగతి మనకు తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, యూకే ప్రధాని రిషి సునక్‌, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సహా ప్రపంచ నేతలంతా కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వాతావరణ మార్పులపై కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగారు. ఇక ఈ ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె COP28లో గుడ్ ఫ్రెండ్స్.. #Melodi” అంటూ ఇటాలియన్ ప్రధాని మెలోని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

COP28 సమ్మిట్ లో పాల్గొన్న మోడీ…

మోదీ ఇటాలియన్ కౌంటర్‌ గురించి మెలోని ప్రస్తావించారు. స్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం రెండు దేశాల ప్రయత్నాల గురించి మాట్లాడారు. అదేవిధంగా సుస్థిరమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం భారతదేశం, ఇటలీల మధ్య సహకార ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. COP28 సమ్మిట్ UAE ప్రెసిడెన్సీలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు జరగనుంది. శుక్రవారం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని తిరిగి ఇండియా చేరుకున్నారు.