Featured

Telangana Election counting: ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం… పటిష్ట భద్రతా చర్యలు నడుమ కౌంటింగ్?

Telangana Election counting: తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30వ తేదీ జరిగిన సంగతి మనకు తెలిసిందే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు .ఈ ఎలక్షన్స్ లో భాగంగా అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని కొందరు కాంగ్రెస్ పార్టీ వస్తుందని మరికొందరు పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా వేస్తున్నారు.

ఎన్నికలు కౌంటింగ్ డిసెంబర్ 3వ తేదీ ఆదివారం జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఆదివారం కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రత చర్యలను నడుమ జిల్లా కలెక్టరేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేశారని తెలుస్తుంది. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఇక ఉదయం ఎనిమిది గంటలకు కౌటింగ్ ప్రారంభమవుతుందని ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను కౌంట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన అరగంటకు ఈవీఎం కౌంటింగ్ జరగనుంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కనక ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ తో పాటు ఈవీఎం కౌంటింగ్ కూడా సమాంతరంగా జరగబోతుందని తెలుస్తోంది. ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాలలో 14 టేబుల్ చేశారని పోస్టల్ బ్యాలెట్ కోసం ఆదనంగా మరొక టేబుల్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. కలెక్టర్,ఎన్నికల కమిషన్ అధికారుల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఈ కౌంటింగ్ జరగబోతుంది అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఊరేగింపులకు తావు లేదని అధికారులు తెలియచేశారు.

144 సెక్షన్ అమలు…

ఇలా ఎన్నో ప్రతిష్ట భద్రతాచర్యల నడుమ ఈ ఎన్నికల కౌంటింగ్ జరగబోతోంది. ఓట్లు లెక్కింపు కేంద్రంలో ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఇక ఎన్నికల కౌంటింగ్ కు మరి కొన్ని గంటల సమయం ఉండడంతో ప్రతి ఒక్క పార్టీ నేతలలో కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠత ఆందోళన నెలకొందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

టెన్షన్ ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుందా..? జీవనశైలిలో దాగి ఉన్న అసలు కారణాలు

ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హై బీపీ) సమస్య చాలా సాధారణంగా మారుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో కూడా…

12 minutes ago

చలువ ఇస్తుందని అనుకుంటే తప్పే.. పుదీనా వెనుక ఉన్న నిజం ఇదే!

వంటగదిలో పుదీనా వాసన లేకుండా వంట పూర్తి అవ్వడం అరుదు. చట్నీలు, షర్బత్‌లు, మజ్జిగ, సలాడ్లు ఇలా ఎన్నో వంటకాల్లో…

18 minutes ago

దాహం తీర్చుకుంటున్నాం అనుకుంటే.. ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నామా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రతతో బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారుతున్న వేళ, చల్లదనాన్ని కోసం చాలా…

40 minutes ago

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

13 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

13 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

13 hours ago