Telangana Election counting: తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30వ తేదీ జరిగిన సంగతి మనకు తెలిసిందే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు .ఈ ఎలక్షన్స్ లో భాగంగా అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని కొందరు కాంగ్రెస్ పార్టీ వస్తుందని మరికొందరు పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా వేస్తున్నారు.

ఎన్నికలు కౌంటింగ్ డిసెంబర్ 3వ తేదీ ఆదివారం జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఆదివారం కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రత చర్యలను నడుమ జిల్లా కలెక్టరేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేశారని తెలుస్తుంది. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఇక ఉదయం ఎనిమిది గంటలకు కౌటింగ్ ప్రారంభమవుతుందని ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను కౌంట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన అరగంటకు ఈవీఎం కౌంటింగ్ జరగనుంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కనక ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ తో పాటు ఈవీఎం కౌంటింగ్ కూడా సమాంతరంగా జరగబోతుందని తెలుస్తోంది. ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాలలో 14 టేబుల్ చేశారని పోస్టల్ బ్యాలెట్ కోసం ఆదనంగా మరొక టేబుల్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. కలెక్టర్,ఎన్నికల కమిషన్ అధికారుల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఈ కౌంటింగ్ జరగబోతుంది అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఊరేగింపులకు తావు లేదని అధికారులు తెలియచేశారు.
144 సెక్షన్ అమలు…
ఇలా ఎన్నో ప్రతిష్ట భద్రతాచర్యల నడుమ ఈ ఎన్నికల కౌంటింగ్ జరగబోతోంది. ఓట్లు లెక్కింపు కేంద్రంలో ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఇక ఎన్నికల కౌంటింగ్ కు మరి కొన్ని గంటల సమయం ఉండడంతో ప్రతి ఒక్క పార్టీ నేతలలో కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠత ఆందోళన నెలకొందని చెప్పాలి.



































