Categories: FeaturedMovie News

Bigg Boss 7: మొదటి ఫినాలే టికెట్ గెలుచుకున్న అర్జున్… అమర్ ను బలి పశువును చేసిన శోభ?

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం 13వ వారం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ వారంలో టికెట్ ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అందరూ కూడా ఈ ఫినాలే రౌండ్ నుంచి తప్పుకోవడంతో చివరికి అర్జున్ డైరెక్ట్ గా టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫైనల్ కు చేరారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ టాస్కుల నుంచి తప్పుకోవడంతో చివరికి అమర్ అర్జున్ మిగిలారు. ఇక అమర్ కూడా శోభ చెప్పిన విధంగా ఆట ఆడుతూ కన్ఫ్యూజన్ అయ్యారు. దీంతో అర్జున్ ఫినాలేకి చేరుకున్నారు.

ఇలా అర్జున్ ఫైనల్ కు వెళ్లడంతో తిరిగి మరోసారి అమర్ కు నిరాశ ఎదురయింది. అయితే శోభ తన అతి తెలివితేటలను ప్రదర్శిస్తూ అమర్ కు గొడవ పెట్టాలని ప్రయత్నం చేశారు. గౌతమ్ ఈ టాస్క్ నుంచి తప్పుకోవడంతో తన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ సగం తన స్నేహితుడైనటువంటి అర్జున్ కి ఇవ్వాలని అనుకుంటాడు కానీ ప్రియాంక చెప్పడంతో ఆ పాయింట్స్ కాస్త అమర్ కి ఇస్తుంది. అయితే గౌతమ్ తన పాయింట్స్ ఇస్తూ ఇవి ప్రియాంక పాయింట్స్ అయితే ఇకపై తనని ఏమీ అనుకు అంటూ ఇచ్చారు దీంతో అమర్ కూడా సైలెంట్ అయ్యారు.

ఇలా గౌతమ్ పాయింట్స్ అమర్ కి ఇవ్వడంతో మధ్యలో ఇన్వాల్వ్ అయినటువంటి శోభా ఏమనకు అంటే ఏంటీ.. పాయింట్స్ ఇస్తే ఇవ్వు.. అలా అనడం కరెక్ట్ కాదు గౌతమ్ అంటూ గొడవ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ గౌతమ్ ఆమె మాటలను పట్టించుకోలేదు. తిరిగి మరోసారి అర్ధరాత్రి ఇదే రచ్చ చేసింది శోభా శెట్టి. పల్లవి ప్రశాంత్ వద్ద ఏవిక్షన్ పాస్ ఉంది. మళ్లీ పవర్ అస్త్రను కూడా తనే గెలిస్తే ఎలాగ అందుకే నీకు సపోర్ట్ చేయమని వెళ్లి అర్జునుని అడుగు అంటూ పంపించింది. అమర్ శోభ చెప్పిన విధంగానే తనని వెళ్లి అడిగారు.

మొదటి ఫైనలిస్ట్ గా అర్జున్…

అమర్ తనకు సపోర్ట్ చేయమని అర్జునుని అడగడంతో అర్జున్ వెంటనే వాడు కూడా మనిషి కదరా తనకు సపోర్ట్ చేస్తే ఏంటి అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.దీంతో వాడికి ఎవిక్షన్ పాస్ ఉంది అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత మూడు టాస్కులలో అర్జున్ గెలిచి మొదటి ఫైనల్ లిస్ట్ కాగా శోభ అతి తెలివితేటలకు అమర్ బలి అయ్యారని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago