J D Chakravarthy : తేజకి అపద్ధాలు ఆడటం సరదా…? నన్ను రిస్క్ లో పెట్టాడు..20 మంది నన్ను కొట్టేవాళ్ళు…నా కారు తగలబడి పోయేది… కృష్ణవంశీతో గొడవలకు కారణం అదే…: జేడి చక్రవర్తి

J D Chakravarthy : సినిమాతో తెలుగు లో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులకు గుర్తిస్తాడు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జే డి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ, అటు తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో దయ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఆగష్టు లో రానున్న ఈ వెబ్ సిరీస్ గురించి ఇంటర్వ్యూ లలో మాట్లాడుతూ తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను మాట్లాడారు.

తేజకు మతిమరుపు వచ్చినట్లుంది….

డైరెక్టర్ తేజ ప్రేమ వివాహం చేసుకున్నాడు. నెల్లూరుకి నేను తేజ వెళ్ళాము. మొదట ఒక చోట వెయిట్ చేస్తే అక్కడికి రాలేదు. దీంతో ఇంకో చోటికి వెళ్లి ఒక పాడుబడిన ఇంటి దగ్గర తేజ దాక్కొని నన్ను ముందుకు వెళ్లి తన కాబోయే వైఫ్ ని ఎక్కించుకోమని చెప్పాడు. నేను కొత్తకారు అప్పుడే తీసుకున్నాను. నా ముందు ఇరవై మంది నిలుచున్నారు. నా కారు తగలబడిబోతుందని టెన్షన్ పడ్డాను. కర్రలు, రాలు తీసుకుని వచ్చారు.

ఆ సంఘటన నాకు బాగా గుర్తు ఒకప్పట్లో సితార పత్రికలో కూడా ప్రేమికుల రోజు సందర్బంగా తేజ ఈ స్టోరీ అంత చెప్పాడు. తాను మర్చిపోయాడేమో నా కారు ఆరోజు ఏమవుతోందో అనే భయం నాకు తెలుసు నేను మర్చిపోలేదు. కావాలంటే ఆ మ్యాగ్జైన్ లో చూడొచ్చు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక కృష్ణ వంశీ గారు చాలా ఏళ్ల తరువాత మళ్ళీ ‘దయ’ వెబ్ సిరీస్ వేడుకలో కనిపించగా ఆయనతో ఉన్న గొడవల గురి నుంచి చెబుతూ మా మధ్య ఒక విషయానికి చిన్న అభిప్రాయాబేధాలు వచ్చాయి అందరికి వస్తాయి కదా అలానే అంటూ చెప్పారు. మా మధ్య బాండింగ్ ఎప్పటికి అలానే ఉంటుంది అంటూ చెప్పారు.