Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార ప్రస్తుతం పెళ్లి చేసుకున్నప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా పలు సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారు.
ఇలా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నయనతార తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించినటువంటి జవాన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే నయనతారకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇకపోతే నయనతార ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు మరి ఈ సినిమా కోసం ఈమె బారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం.
ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి హీరోయిన్లలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి నయనతార ఇప్పుడు మరింత అధిక రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ప్రస్తుత ఒక్కో సినిమాకు ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి ఈమె జవాన్ సినిమా కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొని సౌత్ ఇండస్ట్రీలోనే రెమ్యూనరేషన్ విషయంలో నయనతార టాప్ పొజిషన్లో ఉన్నారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…