Jabardasth : జబర్దస్త్ లో జడ్జ్ లు, టీమ్ లీడర్లు, యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు బుల్లితెరపై కామెడీ షో అనగానే ముందుగా ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చే పేరు జబర్దస్త్ కామెడీ షో. ఈ షో ద్వారా ఇంటిల్లిపాది గంటసేపు హాయిగా నవ్వుకుంటున్నారు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ కామెడీ షో అన్ని ఇళ్లలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది.

Jabardasth : జబర్దస్త్ లో జడ్జ్ లు, టీమ్ లీడర్లు, యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఈ షో విజయవంతం కావడం లో కమెడియన్స్ పాత్ర తో పాటు ఆ షో కి జడ్జ్ గా వ్యవహరించే వారి పాత్ర కూడా బాగానే ఉంటుంది. మరి అలాంటి షోలో జడ్జిలు, యాంకర్లు, టీం లీడర్లకు నెలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఇంతకీ ఈ షో ద్వారా ఎవరెవరు ఎంత పారితోషకం అందుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Jabardasth : జబర్దస్త్ లో జడ్జ్ లు, టీమ్ లీడర్లు, యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

జబర్దస్త్ జడ్జిల్లో ఒకరైన నటి రోజా మొదటి నుంచి ఈ షో ని విడిచిపెట్టింది లేదు. షో ప్రారంభం నుంచి రోజా జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. షో కి వచ్చిన మొదట్లో ఒక్కో ఎపిసోడ్ కు కేవలం 3 నుంచి 4 ల‌క్ష‌లు రేంన్యునరేషన్ తీసుకునేవారు. అయితే రోజా తో పాటు మరో జడ్జ్ గా వ్యవహరించిన నాగబాబు కొద్ది రోజుల క్రితం ఈ షో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆయన వెళ్లాక రోజా రెమ్యునరేషన్ డబుల్ అయ్యిందట. ప్రస్తుతం ఈమె ఒక్కో ఎపిసోడ్ కు 8 లక్షలు తీసుకుంటుందట. అంటే నెలకు 30 లక్షలు అన్నమాట. కేవలం నెలలో నాలుగు రోజులు మాత్రమే ఆమె ఈ షో కోసం టైం కేటాయిస్తారట.

ఇక మరో వైపు నాగ బాబు ప్లేస్ లో జడ్జి వచ్చిన మనో ఎపిసోడ్ కు ప్రస్తుతం దాదాపు 2 లక్షలు మాత్రమే అందుకుంటున్నాడట. మనో సింగర్ గా తనదైన శైలిలో షోస్ ని హోస్ట్ చేస్తుండేవారు. కానీ తన మార్కు కామెడీ ప్రస్తుతం జబర్దస్త్ లో మనో ద్వారా కనిపించడం లేదు.

ఇక యాంకర్ల విషయానికి వస్తే గతంలో రష్మి, అనసూయ ఒక్కో ఎపిసోడ్ కు 80 వేల రూపాయల పారితోషకం తీసుకునేవారట. అయితే ఇటీవలే వారి రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందట. ప్రస్తుతం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా 2 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నారట.

ఇక టీం లీడర్ల విషయానికి వస్తే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కమెడియన్స్ అందరికన్నా కూడా ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. హైపర్ ఆది టీమ్ గతంలో 2.5 లక్షల వరకు పారితోషికం తీసుకునేదట. ప్రస్తుతం ఈ రేటు 3 లక్షలకు పెరిగిందని తెలుస్తోంది. అటు మొదట్లో ఎపిసోడ్‌కు 3 నుంచి 3.5 ల‌క్ష‌లు అందుకున్న సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ .. ఇప్పుడు 4 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక అదిరే అభి రూ. 2 లక్షలు పారితోషకంగా తీసుకుంటున్నాడట. సీనియర్ కమెడియన్ అయిన రాకెట్ రాఘ‌వ 2.75 లక్షల వరకు అందుకుంటున్నాడట.

మరో వైపు బుల్లెట్ భాస్క‌ర్ అండ్ టీం కూడా 2 ల‌క్ష‌లు, చ‌లాకీ చంటి 2 ల‌క్ష‌లు, సునామీ సుధాక‌ర్, కెవ్వు కార్తిక్ కూడా రెండు లక్షల వరకు తీసుకుంటున్నాడట. మొత్తంగా జబర్దస్త్ మూలంగా చాలా మంది మంచి పేరు, గుర్తింపు తో పాటు డబ్బు కూడా బాగానే సంపాదించుకుంటున్నారు.