Categories: FeaturedMovie News

Sangeetha : రాష్ట్రపతి అవార్డు తీసుకున్న ఈ హీరోయిన్ కి సడెన్ గా అవకాశాలు ఎందుకు తగ్గిపోయాయో తెలుసా.?!

తెలంగాణ ప్రాంతం లోని ఓరుగల్లు వనిత చిన్ననాడే నాటక రంగాన గజ్జెగల్లు మనిపించి అనతికాలంలోనే వెండితెరపై కనిపించి ప్రేక్షకుల గుండెఝల్లు మని పించిన హీరోయిన్ సంగీత. ఆమె స్నేహితురాల్లు సినిమాల్లో ప్రయత్నించమని చెప్పగానే తన తల్లి, అన్నయ్య తో కలిసి మద్రాసు బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమె బంధువులు ఎవరూ కూడా సినిమారంగంలో వచ్చిన దాఖలాలు లేవు. అలా తన అన్నయ్య ఒక రోజు మద్రాస్ పాండీబజార్లో తిరుగుతున్నప్పుడు ఒక మేనేజర్ పరిచయమయ్యాడు. అలా మేనేజర్ సహాయ సహకారాలతో మొదటగా తీర్పు అనే సినిమాలో సంగీత నటించింది.

తదుపరి రెండో అవకాశంగా బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గు సినిమా లో నటించింది. ఆ తర్వాత సంగీత నటించిన తాయారమ్మ బంగారయ్య, చిలకమ్మ చెప్పింది, శ్రీరామ పట్టాభిషేకం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అయితే సంగీత సినిమాలు చేస్తున్నప్పుడు.. ఎంజీఆర్ తో నటిస్తున్న లతా ఇదివరకే హీరోయిన్ గా ఉండడం వలన ముత్యాలముగ్గు దర్శకుడు బాపుగారు లతను కాస్త సంగీతగా మార్చాడు.

అప్పటి నుంచి ముత్యాలముగ్గు సంగీత గా పేరు పొందడం జరిగింది. బాపు సినిమాలు సాధారణంగా మేకప్ లేకుండా సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. హీరోయిన్ గా సంగీతకు ముత్యాలముగ్గులు అవకాశం వచ్చినప్పుడు మేకప్, ఆభరణాల అలంకరణ ఉంటాయి కావచ్చు అనుకుంది. కానీ అలాంటివి బాపు గారు ముత్యాల ముగ్గు లో సంగీత కు అవకాశం ఇవ్వలేదు. మేకప్ లేకపోవడం వలన సంగీత అంతగా ఇష్టంతో ఆ సినిమాలో నటించలేదు. కానీ ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత ఈ సినిమా లో ఉత్తమ నటనను కనబరిచి నందుకు సంగీతకు ఏకంగా రాష్ట్రపతి అవార్డు వచ్చింది.

ముత్యాల ముగ్గు విజయం సాధించినందుకు ఆనందంలో ఉన్న సంగీతకు అవకాశాలు తగ్గిపోతున్నయనే విషయాన్ని ఆలోచించ లేకపోయింది. సంగీత తక్కువ వయసులోనే కుటుంబపరమైన గృహిణి పాత్రలో నటించడం వలన.. గ్లామరస్ పాత్రలు సంగీత కు ఏవీ రాలేదు. అప్పటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తో కూడా అవకాశాలు లేకుండా పోయాయి. ఒకవేళ వచ్చినా అక్క, చెల్లి ఆ తర్వాత తల్లి పాత్రలో నటించడం జరిగింది. తను ముత్యాలముగ్గు సినిమాలో సంప్రదాయ పరమైన ఆ పాత్రను చేయడం వల్లనే గ్లామరస్ పాత్రలు రాకుండా పోయాయని.. అలా కాకుంటే తను కూడా స్టార్ హీరోయిన్ గా ఉండే దానినని సంగీత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago