జగన్ సర్కార్ శుభవార్త.. ఉచితంగా నిత్యావసర సరుకులు!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమపై వర్షాల ప్రభావం అంతగా లేకపోయినా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు వర్షాలు, వరదల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో వర్షాలు, వరదల ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ వరదల వల్ల వందల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తాజాగా జగన్ సర్కార్ వర్షాలు, వరదల వల్ల నిరాశ్రయులైన వాళ్లకు శుభవార్త చెప్పింది. వరద బాధితులకు ఉచితంగా ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం నుంచి జీవో విడుదలైంది. రాష్ట్రంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో అధికారులు బాధితుల వివరాలను సేకరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. బాధితులకు సరుకులు అందే విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల రేషన్ బియ్యం, లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు ఇవ్వనుంది. వేగంగా నిత్యావసర సరుకుల పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జగన్ సర్కార్ ఆదేశించింది. మరోవైపు పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు నగదు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జగన్ సర్కార్ ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రయోజనం చేకూర్చుతూ ఉండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.