దేశంలో ప్రజలు కరోనా మహమ్మారి కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మహమ్మారిని కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. సీరమ్ ఇన్సిట్యూట్ ఇప్పటికే డిసెంబర్ నాటికి భారత్ కు ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ ముక్కు ద్వారా ఉపయోగించే వ్యాక్సిన్ కొరకు దేశంలో ప్రయోగాలు చేయడానికి భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు ఇచ్చినట్టు వెలడించారు.
త్వరలో వ్యాక్సిన్ల ప్రయోగాలకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇవ్వనుంది. వ్యాక్సిన్ల ప్రయోగాలు సక్సెస్ అయితే మాత్రం ఇంట్రా నాసల్ కొవిడ్ వ్యాక్సిన్ మరికొన్ని నెలల్లోనే భారత ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సాధారణ వ్యాక్సిన్లతో పోలిస్తే ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను దాదాపు 40 వేల మంది వాలంటీర్లపై ప్రయోగించే అవకాశం ఉంది.
మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ రష్యా కరోనా వ్యాక్సిన్ కు కూడా భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంజక్షన్ల రూపంలో ఉన్న వ్యాక్సిన్ల తయారీ మాత్రమే జరుగుతోందని.. చెప్పిన సమయంలో భారత్ ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగాలను చేపడుతూ ఉండటం గమనార్హం.
కరోనా వైరస్ మన శరీరంలోకి ముక్కు, నోటి ద్వారానే ప్రవేశిస్తూ అనేక ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 75 లక్ష్లలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుందని సమాచారం. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ తరహా కరోనా వ్యాక్సిన్ గురించి ప్రయోగాలు చేపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…