ఎస్సీ, ఎస్టీలకు జగన్ సర్కార్ శుభవార్త.. మరో కొత్త స్కీం ప్రారంభం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కులాల ప్రజలకు శుభవార్త చెప్పారు. జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం పేరుతో కొత్త స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేయనున్నారు. సీఎం జగన్ నేడు 2020 – 23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఈ కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చామని వెల్లడించారు.

రాష్ట్రంలోని ఎస్సీలకు 16,2 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున భూములను కెటాయిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అధికారులు ఈ రెండు కులాలకు చెందిన వాళ్లలో ఎవరికైనా పరిశ్రమలు పెట్టుకోవాలనే ఆసక్తి ఉంటే ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియజేయాలని పేర్కొన్నారు. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించారు.

దసరా పండుగ నేపథ్యంలో ఈ కొత్త స్కీమ్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. దసరా పండుగ సమయంలో ఈ స్కీంను అమలు చేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు కోటి రూపాయల ప్రోత్సాహకాలను ప్రకటించబోతున్నామని వెల్లడించారు.

పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీలు కల్పించబోతునామని సీఎంతెలిపారు. పేదల జీవితాలను మార్చాలనే ఉద్దేశంతో నవరత్నాల హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.