Featured

మందుబాబులకు జగన్ సర్కార్ షాక్.. ఏం జరిగిందంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మందుబాబులకు భారీ షాక్ ఇచ్చింది. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తెచ్చుకోవడానికి అనుమతులపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా మద్యం తెచ్చుకోవాలంటే పర్మిట్ తప్పనిసరిగా ఉండాలని.. పర్మిట్లు లేకుండా మద్యం తెచ్చుకునేవాళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఎక్సైజ్ శాఖ నుంచి ఈ మేరకు కొత్తగా జీవో నెంబర్ 310 విడుదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి భారీగా మద్యం వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనే సదుద్దేశంతో సంవత్సరం సంవత్సారనికి మద్యం దుకాణాల సంఖ్య భారీగా తగ్గిస్తుంటే మందుబాబులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకుంటూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు.

గతంలో రాష్ట్రంలోని ప్రజలకు ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవడానికి అనుమతి ఉండేది. అయితే కొత్త జీవో ప్రకారం మందుబాబులు మందుబాటిళ్లను తెచ్చుకోలేరు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యంపై పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలయ్యే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసింది. అయితే కేంద్ర నిబంధనల ప్రకారం విదేశాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చు.

మద్యం ప్రియులు నిబంధనలు అతిక్రమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. పర్మిట్లు లేకుండా మద్యం తెచ్చుకునే వాళ్లపై 1968 ఎక్సైజ్ చట్టం కింద ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మద్యం అక్రమ రవాణా వల్ల ప్రభుత్వానికి రోజురోజుకు ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసి కొత్త జీవో విడుదల చేసింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago