Jayalalitha: నటి జయలలిత మరణం పై వెలుగులోకి వచ్చిన నిజాలు.. ఆ విషయాలన్నీ బయటపెట్టిన ఆర్ముగ స్వామి కమిషన్!

Jayalalitha: తమిళనాడు ప్రజలకు అమ్మగా ఎంతో మంచి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం నుంచి ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు కోలుకోలేకపోతున్నారు. ఈమె మరణించి సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఈమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే నటి జయలలిత మరణం పై ఎన్నో అనుమానాలు కూడా గతంలో వ్యక్తం అయ్యాయి.

ఈ క్రమంలోనే జయలలిత మరణం పై తమిళనాడు ప్రభుత్వం ఆర్ముగ స్వామి కమిషన్ ద్వారా విచారణ చేపట్టాలనీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కమిషన్ ఒక రిపోర్ట్ తయారుచేసి తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదికలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5 వ తేదీ రాత్రి 10 గంటలకు మరణించారని అపోలో హాస్పిటల్ వైద్యులు అధికారికంగా వెల్లడించారు. అయితే ఈమె మరెన్నో వార్త పై ఎన్నో అనుమానాలు సందేహం వ్యక్తం అవడంతో తమిళనాడు ప్రభుత్వం అమ్మ మరణం పై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.

Jayalalitha వెలుగులోకి వచ్చిన నిజాలు…

ఈ క్రమంలోనే ఆర్ముగ స్వామి కమిషన్ జయలలిత మరణం పై దర్యాప్తు చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం జయలలిత డిసెంబర్ 4 మధ్యాహ్నం 3:50 సమయంలోనే మరణించారని పేర్కొన్నారు. అయితే ఈమె డిసెంబర్ 4వ తేదీ మరణించడంతో డిసెంబర్ 5న అధికారకంగా ప్రకటించారు. మరి ఈ 31 గంటల వ్యవధిలో ఏం జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది.