Jayamalini: సీనియర్ నటి జయమాలిని ఇంట పెళ్లి సందడి… వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఇన్విటేషన్!

Jayamalini: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపినటువంటి వారిలో జ్యోతిలక్ష్మి జయమాలిని అక్కచెల్లెళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. నటిగా జయమాలిని పలు సినిమాలలో హీరోయిన్గా చేసిన అనంతరం ఈమె స్పెషల్ సాంగ్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర సాధించారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి జయమాలిని పోలీస్ అధికారి అయినటువంటి పార్తీబాన్ ను వివాహం చేసుకున్నారు.వివాహం చేసుకున్న తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం గృహిణిగా తన పిల్లల బాగోగులను చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు.

ఇలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన జయమాలిని ఇండస్ట్రీకి దూరం కావడంతో అభిమానులలో చిన్నపాటి నిరుత్సాహం ఏర్పడింది. అయితే జయమాలిని ఇంట తాజాగా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. జయమాలిని కుమారుడు శ్యామ్ హరికి తాజాగా వివాహం నిశ్చయం కావడంతో ఈమె ఇంట పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

Jayamalini: చెన్నైకి చెందిన ప్రియాంకతో వివాహం…


శ్యామ్ హరి వివాహం చెన్నైకి చెందిన ప్రియాంకతో నేడు (ఫిబ్రవరి 23) చెన్నైలో ఎంతో ఘనంగా జరగనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే వీరి వివాహ రిసెప్షన్ కు పెద్ద ఎత్తున నటీనటులు ఇతర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఇక వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.