Senior Journalist Bhardwaja : కుప్పం పాదయాత్రకు వెళ్లి గుండె పోటు రావడంతో నారాయణ హృదయాలయలో 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు శివరాత్రి రోజున మరణించారు. ఆయన మరణం ఆయన కుటుంబాన్నే కాకుండా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అలాగే తెలుగు ప్రజలను బాధకు గురిచేసింది. ఇక ఆయన ఈమధ్యనే మళ్ళీ పాలిటిక్స్ లో బిజీ అవుతూ ఈసారి ఎమ్మెల్యే గా గెలిచి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అందుకోసం సిద్ధపడుతున్న సమయంలో ఇలా అనంతలోకాలకు వెళ్లిపోయారు.
అలేఖ్య రెడ్డికి గుడివాడ ఎమ్మెల్యే టికెట్…
తారకరత్న గుడివాడ ఎమ్మెల్య్ టికెట్ ను చంద్రబాబు వద్ద ఆశించారని అయితే అనుకోని ప్రమాదంలో ఆయన మరణించడంతో ఆ సీటు ఇప్పుడు ఆయన భార్య అలేఖ్య రెడ్డికి చంద్రబాబు ఇస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రచారంలో ఉన్న నిజానిజాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు వివరించారు. నిజానికి తారకరత్న అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమన్నా అక్కడి నుండి పోటీ చేస్తానని ఇంతకుముందు తెలిపినట్లు భరద్వాజ గుర్తు చేసారు.
ఆయన గుడివాడ సీటు కావాలని అడగలేదని అయితే గుడివాడ సీటు తన తాత గెలిచి అసెంబ్లీకి వెళ్లిన సీటు గనుక ఇస్తే బాగుంటుంది అనుకుని ఉండవచ్చు అంటూ చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే సీటుట్ ఈసారి ఒక ఎన్ఆర్ఐ కి ఇవ్వనున్నట్లు ఆల్రెడీ సమాచారం ఉంది. సదరు ఎన్ఆర్ఐ కు ఆల్రడీ చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేసాడు అనే ప్రచారం ఉంది అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. అలేఖ్య రెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారంలో నిజం లేదని, అటు టీడీపీ పార్టీ నుండి కానీ చంద్రబాబు మరియు కుటుంబం నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని తేల్చారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…