Jayamalini: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపినటువంటి వారిలో జ్యోతిలక్ష్మి జయమాలిని అక్కచెల్లెళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. నటిగా జయమాలిని పలు సినిమాలలో హీరోయిన్గా చేసిన అనంతరం ఈమె స్పెషల్ సాంగ్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర సాధించారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి జయమాలిని పోలీస్ అధికారి అయినటువంటి పార్తీబాన్ ను వివాహం చేసుకున్నారు.వివాహం చేసుకున్న తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం గృహిణిగా తన పిల్లల బాగోగులను చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు.
ఇలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన జయమాలిని ఇండస్ట్రీకి దూరం కావడంతో అభిమానులలో చిన్నపాటి నిరుత్సాహం ఏర్పడింది. అయితే జయమాలిని ఇంట తాజాగా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. జయమాలిని కుమారుడు శ్యామ్ హరికి తాజాగా వివాహం నిశ్చయం కావడంతో ఈమె ఇంట పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.
శ్యామ్ హరి వివాహం చెన్నైకి చెందిన ప్రియాంకతో నేడు (ఫిబ్రవరి 23) చెన్నైలో ఎంతో ఘనంగా జరగనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే వీరి వివాహ రిసెప్షన్ కు పెద్ద ఎత్తున నటీనటులు ఇతర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఇక వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…