Hema: సినీనటి హేమకు భారీ షాక్.. జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు!

Hema: గత నెల 20వ తేదీ బెంగుళూరులోని ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో భాగంగా దాదాపు 100 మంది పాల్గొన్నట్టు పోలీసులకు గుర్తించారు అయితే వీటిలో సుమారు 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ రేవ్ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నటి హేమ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని, ఆమెకు డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో విచారణకు హాజరుకావాలని పోలీసులు తనకు నోటీసులు పంపించారు. అయితే ఈమె మాత్రం ఈ వార్తలను తోసుకొచ్చారు తాను ఈ పార్టీలో పాల్గొనలేదని ఆ సమయంలో తాను హైదరాబాదులో తన ఫామ్ హౌస్ లో ఉన్నానని తెలిపారు.

ఇక పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపినప్పటికీ ఈమె మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీంతో పోలీసులు ఈమెను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇలా అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచగా ఈమెకు కోర్టు నుంచి ఊహించని తీర్పు వెళ్లడైంది ఈ నెల 14వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

జ్యూడిషియల్ రిమాండ్…
ఇక ఈమె పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ కూడా తాను ఈ రేవ్ పార్టీలో పాల్గొనలేదని ఉద్దేశపూర్వకంగానే నన్ను ఈ కేసులోకి లాగారని ఆరోపణలు చేశారు. తాను తన ఇంట్లో ఉంటూనే ఆవకాయ వీడియో పెట్టానని కూడా హేమ మాట్లాడారు. ఏది ఏమైనా ఈ పార్టీలో ఆరోపణలను ఎదుర్కోవడమే కాకుండా ఈమె పాల్గొన్నారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు తనని అరెస్టు చేయడంతో కోర్టు తనకు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం ప్రస్తుతం సంచలనగా మారింది.