Pawan Kalyan: ఏపీ ఎన్నికల ఫలితాలు ఊహించన విధంగా ఉన్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలలో కూటమి హావ కొనసాగుతుంది. మరోవైపు అధికార పార్టీ అయినటువంటి వైయస్ఆర్సీపీ పూర్తిగా వెనకంజలో ఉంది. జనసేన పార్టీ సైతం పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో పవన్ హవా కొనసాగుతోంది.
పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యర్థి వంగా గీత పై పవన్ కళ్యాణ్ సుమారు 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం కావడంతో పిఠాపురంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పిఠాపురం పోటీ చేస్తున్న 21 స్థానాలలో కూడా జనసేన అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉన్నారు.
ఇక వైసిపి ఊహించిన విధంగా చతికిలా పడిపోయింది. జనసేన అభ్యర్థులు మెజారిటీ సాధించిన స్థానాలలో కూడా వైసిపి మెజారిటీ సాధించలేకపోతోంది. కూటమి హవా చూస్తుంటే దేశ రాజకీయాలని కూడా ఏపీ వైపే చూస్తున్నాయి. ఇక మొదటిసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.
మొదలైన టీడీపీ సంబరాలు…
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు కూటమిదే అధికారమని చెప్పకనే చెప్పేసాయి దీంతో టిడిపి శ్రేణులు అలాగే జనసేన శ్రేణులు సైతం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాలలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులు వెను తిరుగుతూ ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…