Kamal Hassan: కమల్ హాసన్ కి మరి ఇంత కోపమా.. వేదికపై నుంచే అభిమానికి వార్నింగ్ ఇచ్చిన హీరో?

Kamal Hassan: కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కమల్ హాసన్ ఎంతో సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా అంచనాలకు మించి ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో స్వయంగా కమల్ హాసన్ తన అప్పును మొత్తం తీరుస్తానని తెలిపారు. ఇలా సినిమా మంచి విజయం కావడంతో కమల్ హాసన్ ఎంతో చురుగ్గా ‘మక్కల్‌ నీది మయ్యం’పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

kamal-haasan-he-get-very-angry-and-given-a-warned-the-fans-on-the-stage

ఈ క్రమంలో పార్టీ తరఫున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై ఒక నేత రక్తదానం గురించి మాట్లాడుతూ ఉండగా వెనుక నుంచి ఓ అభిమాని పెద్ద ఎత్తున విక్రమ్ విక్రమ్ అంటూ అరిచారు.

kamal-haasan-he-get-very-angry-and-given-a-warned-the-fans-on-the-stage

ఈ విధంగా అభిమాని వేదికపై పెద్ద ఎత్తున కమల్ హాసన్ అతనికి వేలు చూపిస్తూ సైలెంట్ గా ఉండమని చెప్పారు. ఇలా వేదికపైనే కమల్ హాసన్ సీరియస్ అయ్యారు. ఇక తాను ఎందుకు వద్దని చెప్పాను అనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా ఏకంగా 4 లక్షల లీటర్ల రక్తాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాము.ఇదే రక్తాన్ని బయట కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. అలా కాకూడదనే మనం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసాము.

విక్రం అంటే అమ్మటం అని అర్థం…
ఈ విధంగా రక్తదానం గురించి ఒక నేతమాట్లాడుతున్న సమయంలో విక్రమ్ అంటూ అరవగా మనం కూడా రక్తాన్ని అమ్ముతున్నామని భావిస్తారు. తమిళంలో విక్రమ్ అంటే అమ్మడం అని అర్థం వస్తుంది. ఇలా మనం రక్తదానం గురించి మాట్లాడేటప్పుడు విక్రమ్ అంటే మనం కూడా ఈ రక్తం అమ్ముతున్నామని అనుకుంటారు అందుకే అరవద్దని చెప్పాను అంటూ కమల్ హాసన్ అనంతరం వివరణ ఇచ్చారు.