Tik Tak Durgarao: సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఎంతగా అంటే ఏకంగా సెలబ్రిటీలుగా మారిపోయేలా క్రేజ్ దక్కించుకొని ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన వారిలో టిక్ టాక్ దుర్గారావు ఒకరు.
ఈయన ఎక్కడో మారుమూల గ్రామంలో రోజువారి కూలి పనులు చేస్తూ మేనల్లుడు సహాయంతో టిక్ టాక్ వీడియోలు చేయడం నేర్చుకున్నారు. ఈ విధంగా రోజు కూలి పనులకు వెళుతూ సాయంత్ర సమయంలో తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే వారు. ఇలా వీరిద్దరి డాన్స్ వీడియోలకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.
టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో నే ఏకంగా 25 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇక ఇలా వీరిద్దరికి వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను, అలాగే బుల్లితెర పై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ సెలబ్రిటీలుగా మారారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గా రావు దంపతులు వారి జర్నీ గురించి చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
రోజువారీ కూలీ పనులు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్న తనకు తన మేనల్లుడు ద్వారా టిక్ టాక్ వీడియోలు చేయడం నేర్చుకున్నాను. అయితే తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తున్న సమయంలో ఊర్లో దాదాపు 80% మంది తనని విమర్శించారని ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. వీడు పెళ్ళాంతో కలిసి చిందులు వేయడం ఏంటి అంటూ సొంత వాళ్లే మమ్మల్ని దారుణంగా తింటారు. అయితే మేం అవేమీ పట్టించుకోకుండా మేము చేసే పని చాలా నిజాయితీగా చేస్తున్నాము, ఎలాంటి తప్పు పని చేయలేదనీ వారి మాటలు పట్టించుకోకుండా మా ప్రయత్నాలు మేము చేసాము. ఆ భగవంతుడి దయవల్ల, అభిమానులు ఎంతగానో ఆదరించి తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చారని ఈ సందర్భంగా టిక్ టాక్ దుర్గా రావు దంపతులు ఎమోషనల్ అవుతూ ఈ విషయాలను వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…