Karate Kalyani: కరాటే కళ్యాణి పాప విషయంలో బయటికి వచ్చిన నిజాలు?

Karate Kalyani: కరాటే కళ్యాణి గత నాలుగు రోజులనుంచి సోషల్ మీడియా వార్తల్లో చర్చనీయాంశంగా మారారు. యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడంతో ఈమె విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.ఫ్రాంక్ వీడియోస్ అంటూ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసే సమయంలో కరాటే కళ్యాణి చిన్నారిని ఎత్తుకోవడంతో కరాటే కళ్యాణి మరింత చిక్కుల్లో పడింది.ఈ క్రమంలోనే ఆమె చేతిలో ఉన్న చిన్నారి ఎవరు తనని ఎక్కడ నుంచి తీసుకు వచ్చింది అంటూ పెద్ద ఎత్తున ఆరా తీయడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తన ఇంటిలో సోదాలు నిర్వహించి చిన్నారి గురించి ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ చిన్నారి విషయంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులను ఆరాతీయగా కరాటే కళ్యాణి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కిఇంటర్వ్యూ ఇస్తూ తను ఆ పాపను దత్తత తీసుకున్నానని తెలిపిన కరాటే కళ్యాణి నిన్న మీడియా సమావేశంలో ఆ పాప గురించి సంచలన విషయాలు బయట పెట్టారు.

ఈ క్రమంలోనే ఆ పాపను ఇంకా తాను దత్తత తీసుకో లేదని ఆ బిడ్డ తనకు అలవాటు పడిన తర్వాత లీగల్ గా దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ లీగల్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో చిన్నారి తల్లిదండ్రులకు అవసరం ఉంటుంది గనుక వారిని కూడా తన వద్ద ఉంచుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ విషయంపై చిన్నారి తల్లిదండ్రులు స్పందించి తమ కూతురిని మనస్ఫూర్తిగా ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ విధంగా ఒక చిన్నారిని దత్తత తీసుకోకుండా, చిన్నారి పట్ల కళ్యాణి వ్యవహరించిన తీరు ప్రస్తుతం ఆమెను తప్పు పడుతోంది. ఈ విషయంలో కుటుంబ పోషణ భారమై బిడ్డను తనకిచ్చిన తల్లిదండ్రుల పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ పలువురు నిపుణులు ఈ విషయంపై స్పందిస్తున్నారు.

గత పది సంవత్సరాల క్రితం ఇలా బిడ్డ పోషణ భారమై తల్లిదండ్రులు ఇతరులకు పిల్లలకి అమ్ముకునేవారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఊయల అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఊయల ద్వారా ఎంతో మంది పిల్లలను కాపాడి ప్రముఖ ఎన్జీవో, ప్రజాప్రతినిధుల సహాయంతో ప్రతి ఒక్కరిలోనూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు గురించి అవగాహన చర్యలు చేపట్టారని నిపుణులు వెల్లడిస్తున్నారు.

తల్లిదండ్రుల పై చర్యలు తీసుకోవచ్చు..


ఈ విధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ల గురించి అవగాహన చర్యలు చేపట్టిన తర్వాత బిడ్డలను అమ్మడం చాలా వరకు తగ్గిందని భావించారు. అయితే ఈ సంఘటన ద్వారా ఇలాంటి సంఘటనలు ఇంకా తగ్గలేదని బయటకు తెలియకుండా ఇలా పిల్లలను అమ్ముకోవడం జరుగుతుంది అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి విషయంలో ఎలాంటి లీగల్ ప్రాసెస్ లేకుండా బిడ్డను తీసుకోవడంతో తన పై క్రిమినల్ కేసు పెట్టవచ్చని, అదేవిధంగా తల్లిదండ్రుల పై కూడా చర్యలు తీసుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. మరి కరాటే కళ్యాణి ఈ విషయం ఎన్ని పరిణామాలకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.