Manchu Vishnu : మెగా ఫ్యామిలీ కి మంచూ ఫ్యామిలీ కి మధ్య వివాదాలు పెరగడం తప్పితే తగ్గేలా లేదు. ఇద్దరిలో ఎవరికి అవకాశం వచ్చినా ఎవరు వదులుకోవడం లేదు, అవతలి వారి మీద కౌంటర్ లు వేస్తూనే వున్నారు. మా ఎలక్షన్ల అప్పటినుండి వీరిద్దరి మధ్య వివాదాలు బాగా రాజుకున్నాయ్. అయితే తాజాగా విడుదల అయిన మోహన్ బాబు సినిమా సన్ ఆఫ్ ఇండియా మీద నాగబాబు వేసిన సెటైర్ లు వీటిని పెంచాయ్ అనే చెప్పుకోవాలి. ఇక రీసెంట్‌గా మంచు విష్ణు, దాసరి జయంతి సందర్భంగా.. ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణ రావును ఎవరు రీప్లేస్ చేయలేరు అంటూ ఇండస్ట్రీ పెద్ద అంటే అప్పటికీ ఎప్పటికీ దాసరి నారాయణ రావు గారే ఉంటారు అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ను మంచు విష్ణు ఎవరిని ఉద్దేశించి చేసాడనేది బహిరంగం రహస్యం.
చిరంజీవి పై ఇండైరెక్ట్ కౌంటర్ కోసం మహేష్ ను లాగాడా….
ఇక మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పలు కార్యక్రమాలు చేపడుతూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ‘మా’ సభ్యుల కోసం ఏఐజీ హాస్పిటల్‌లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈక్రమంలోనే సినిమా టికెట్ ధరల విషయమై మాట్లాడుతూ… టికెట్ రేట్లు విషయంలో పెంచితే కొంతమందికి .. తగ్గిస్తే మరి కొంతమందికి ఇబ్బందులు వస్తాయన్నారు. అందుకే మా అధ్యక్షుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉన్నాను అని చెప్పారు .
టికెట్ల ధర అంశం అనేది చాలా పెద్ద సమస్య . దీనిపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ ఇద్దరు కలిసి చర్చించి ఒక మాట మీదకు రావాలన్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలను పక్కన పెడితే.. రీసెంట్‌గా చిరంజీవి ఆచార్యతో సినిమాతో పాటు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలకు ఒక వారం పాటు టిక్కెట్ ధరలు పెంచుకునేందకు ప్రభుత్వం స్పెషల్ గా అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవిపై ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ వేయడం కోసం మహేష్ బాబును మధ్యలో లాగడం ఇపుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…