Katrina Kaif: మరొకసారి డీప్ ఫేక్ వీడియోకు బలైన కత్రినా కైఫ్.. నెట్టింట వీడియో వైరల్?

Katrina Kaif: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏఐ ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో నెట్టింట ఎన్నో మ్యాజిక్స్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే శోభన్ బాబు, మహానటి సావిత్రి ఏఐ వీడియోస్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. అయితే కొందరు ఆకతాయిలు ఈ టెక్నాలజీని మరో కోణంలో ఉపయోగిస్తున్నారు. పలువురు స్టార్ నటీనటుల ముఖాలతో అసభ్యకరమైన వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఆ వీడియో తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టించింది. ఆ విషయంపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందించారు. అయితే ఆ విషయంపై సీరియస్ గా స్పందించిన పోలీసులు ఎట్టకేలకు రష్మిక డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన వ్యక్తి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒక్క రష్మిక ఫొటోస్ మాత్రమే కాకుండా అలియా భట్, నోరా ఫతేహీ, సోనూ సూద్, కత్రినా కైఫ్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు టాలీవుడ్ తారల డీప్ ఫేక్ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.

అయితే తమ డీప్ ఫేక్ వీడియోస్ గురించి స్పందిస్తూ.. ఇలాంటి వీడియోస్ నమ్మవద్దని అభిమానులకు తెలియజేశారు. కానీ ఇప్పుడు మరోసారి డీప్ ఫేక్ వీడియోకు బలయ్యింది కత్రినా కైఫ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె అనర్గళంగా టర్కిష్ మాట్లాడుతూ కనిపించింది. నిజానికి ఈ వీడియో 2014లో హృతిక్ రోషన్, కత్రినా కలిసి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలోనిది. ఈ వీడియోలో కత్రినా టర్కిష్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది.

కత్రినా డీప్ ఫేక్ వీడియో వైరల్..

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. టవల్ ఫైట్ సన్నివేశంలోని స్టిల్స్ డీప్ ఫేక్ ద్వారా మార్ఫింగ్ చేశారు. అయితే కొన్ని గంటల్లోనే రష్మిక డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ నుంచి తొలగించారు. మరి రోజురోజుకీ నేటిజన్స్ ఆకతాయిలా ఆగడాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. దీంతో చాలామంది ఈ విషయం పట్ల అధికారులు కాస్త సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని భావిస్తూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/reel/C1J1UvqMBNh/?utm_source=ig_embed&ig_rid=ded71047-d429-4562-88dc-d3d2cd550188